Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విచిత్రమైన టైటిల్‌తో వస్తున్న సందీప్ కిషన్: వైజాగ్ ఎంపీ నిర్మాణంలో సినిమా ప్రారంభం
అప్పుడెప్పుడే సినిమాల్లోకి వచ్చినా సరైన హిట్ దొరకక ఇబ్బందులు పడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత అతడు నటించిన ఎన్నో సినిమాలు నిరాశనే మిగిల్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది వచ్చిన 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన అతడు.. లాభాలను కూడా అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.
సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఏమాత్రం నిరాశ చెందకుండా తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి విచిత్రం 'రౌడీ బేబీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

తమిళ స్టార్ హీరో ధనూష్, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మారి 2'. ఇందులోని 'రౌడీ బేబీ' సాంగ్ ఇండియన్ ఫిల్మ్ రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా సాంగ్ లిరిక్‌తోనే సందీప్ కిషన్ సినిమా చేయబోతున్నాడు. వినోదాత్మక చిత్రాలను రూపొందించే నాగేశ్వర్ రెడ్డి దీన్ని కూడా అదే రీతిలో తెరకెక్కించనున్నారు. టైటిల్ ప్రకటనతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సందీప్ కిషన్ పలు తమిళ చిత్రాలతో పాటు 'A1 ఎక్స్‌ప్రెస్' అనే తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాడు.