Don't Miss!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- News
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం..!!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pushpa Sunil first look: భయంకరమైన విలన్ గా సునీల్.. మంగళం శ్రీను మామూలుగా లేడుగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో మిగతా దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా అలాంటి సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
అవసరమైతే కాస్త ఎక్కువ సమయం తీసుకొని కూడా పాన్ ఇండియా సినిమాలను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక పుష్ప సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా మొదటి పాటలో విలన్ గా సునీల్ కనిపించబోతున్నాడు.

మొదట విలన్ గా ట్రై చేయాలని..
కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సునీల్ సినిమా ఇండస్ట్రీలోకి విలన్ అవ్వాలని ఆశతోనే అడుగు పెట్టాడు. కానీ అతని కామెడీ టైమింగ్ బాగుండడంతో ఎక్కువగా హాస్యాస్పదమైన పాత్రలే వచ్చాయి. ఆ రూట్ లో సునీల్ కు మంచి గుర్తింపు లభించింది. ఎలాంటి పాత్ర చేసినా కూడా సునీల్ తనదైన శైలిలో నవ్విస్తూ ఉంటాడు. కేవలం దర్శకుడు చెప్పింది మాత్రమే కాకుండా తన స్టైల్ లో కూడా చేసి చూపించి అందరి ప్రశంసలను అందుకున్నాడు.

పుష్పలో విలన్ గా
ఇక హీరోగా మారిన తర్వాత సునీల్ కొంతకాలం పాటు కామెడీ పాత్రలు దూరమయ్యాడు. ఇక హీరోగా మల్లి వరుసగా డిజాస్టర్స్ ఎదురవడంతో కామెడీ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే అవి కూడా రెగ్యులర్ అయిపోయాయి అని విలన్ పాత్రలు చేసేందుకు కూడా ఒప్పుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఫ్యాన్ ఇండియా మూవీ పుష్పలో సునీల్ భయంకరమైన విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

మంగళం శ్రీనుగా..
పుష్ప సినిమాలో విలన్ పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అందులో సునీల్ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్నాడు. భయంకరమైన లుక్స్ తో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్న మంగళం శ్రీను సినిమాలో సరి కొత్తగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. దర్శకుడు సుకుమార్ విలన్ పాత్రలను కూడా చాలా విభిన్నంగా చూపిస్తూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో సునీల్ పాత్ర ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ఇదివరకే కలర్ ఫోటో సినిమాలో నెగటివ్ పాత్రలో దర్శనమిచ్చిన సునీల్ ఈసారి అంతకుమించి కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది.
Recommended Video

రిలీజ్ ఎప్పుడంటే..
సుకుమార్ పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మెల్లగా విడుదల చేస్తున్న పాటలు కూడా సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి మరి సినిమా మొత్తంగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.