For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో స్టార్.. యువ హీరో ఎవరంటే!

  |

  సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే కొందరు ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్నారు. ఘట్టమనేని నట వారసులుగా రమేష్ కొద్ది సంవత్సరాలు రాణించినా.. నిర్మాతగా స్థిరపడ్డారు. ఆ తర్వాత కృష్ణ వారసుడిగా మహేష్ బాబు సినిమా పరిశ్రమలో అగ్రహీరోగా మారారు. ఆ తర్వాత తన కుటుంబం నుంచి కూతురు భర్త సుధీర్ బాబు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తనకంటూ ఓ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకొని ఇండస్ట్రీకి హిట్స్ అందిస్తున్నారు. అలాగే తన కుమార్తె కొడుకు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ నుంచి ఇలా హీరోలు వస్తూనే ఉన్నారు.

  Super Star Krishna

  ఇక స్వర్గీయ విజయనిర్మల ఫ్యామిలీ నుంచి నటనలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మరికొందరు సిద్దమయ్యారు. ఇప్పటికే వీకే నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి మరొరకరు శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. హీరో త‌ల‌కి చిన్న‌గాయ‌మైన‌ట్లు బ్యాండేజ్ వేసుకుని నిల‌డి ఉంటే పోస్ట‌ర్‌ ఆసక్తిని రేపింది. కంటెంట్‌కు బాగా స్కోప్ ఉన్న చిత్రమనే ఫీలింగ్‌ను కలిగించింది.

  Super Star Krishna

  ఈ సందర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ శరణ్ హీరోగా చేస్తున్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది త‌న‌కు హీరోగా ప‌ర్‌ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శ‌రణ్ యాక్ట‌ర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

  నిర్మాత ఎం సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న సినిమా హీరో లుక్ పోస్టర్‌ను సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సూప‌ర్‌ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న శ‌ర‌ణ్‌కు ఈ సినిమా ఖచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే న‌రేశ్‌, జ‌యసుధ‌, సుధీర్‌బాబు మా టీమ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించ‌డం హ్య‌పీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం అని అన్నారు.

  ఇంకా పేరు పెట్టని సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని, ఈ చిత్రంలో మంచి పేరు ఉన్న నటీనటులు, ప్రతిభావంతులు నటిస్తున్నారు. సాంకేతికంగా, ఉన్నత విలువలతో సినిమాను ఫీల్‌గుడ్‌గా సినమిాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నది. శివకేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ఎం.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేశ్ పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్‌9) సంద‌ర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు. హీరో శరణ్ కుమార్ కృష్ణ నుంచి ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ సందర్బంగా ఆయనను స్పూర్తిగా తీసుకొని రాణించేందుకు కృషి చేస్తానని అన్నారు.

  సాంకేతిక వ‌ర్గం:
  బ్యాన‌ర్‌: శ్రీ వెన్నెల క్రియేష‌న్స్‌
  స‌మ‌ర్ప‌ణ‌: బేబీ ల‌లిత‌
  నిర్మాత‌: ఎం.సుధాక‌ర్ రెడ్డి
  ద‌ర్శ‌క‌త్వం: శివ కేశ‌న కుర్తి
  సినిమాటోగ్ర‌ఫి: చైత‌న్య కందుల‌
  మ్యూజిక్‌: భీమ్స్ సిసిరోలియో
  ఆర్ట్‌: కేవీ ర‌మ‌ణ‌
  ఎడిట‌ర్‌: సెల్వ కుమార్

  English summary
  Super Star Krishna introduces another Star from his family. Sharan Kumar entry into tollywood as hero.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X