మహేశ్ బాబు క్యారవాన్.. ఎన్ని కోట్లో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సౌత్ లో ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. మహేశ్ బాబు సినిమాలతో పాటు ఆయన వ్యక్తిత్వం, లైఫ్ స్టైల్ ను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇక మహేశ్ బాబు వీలైనంత వరకు లో ప్రొఫైల్ ను మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. కేవలం సినిమాల వరకే పబ్లిక్ లో కనిపిస్తూ ఉంటారు. సినిమా లేదంటే ఇక ఫ్యామిలీతోనే ఎక్కువగా సమయం గడిపేస్తూ ఉంటారు. అయినప్పటికీ మహేశ్ బాబు గురించి ఎప్పటికీ ఏదోక ఇంట్రెస్టింగ్ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటుంది. బాబు వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఉవ్విళ్లూరుతుంటారు.
ఈ క్రమంలో తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఖరీదైన క్యారవాన్ గురించి ఇంట్రెస్టింగ్ సమాచారం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వ్యానిటీ వ్యాన్ ఖరీదు, అందులో ఉండే లగ్జరీ, హై టెక్ ఫీచర్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మహేశ్ బాబు చాలా స్టైలిష్ గా కనిపించడమే కాదు. ఆయన వాడే వస్తువులు, ఉండే ఇల్లు, కార్లు, డ్రెసింగ్ ప్రతిది ఆకర్షణీయంగానే ఉండేలా చూస్తున్నారు. అప్పుడప్పుడు చూడటానికి సింపుల్ గా కనిపించినా గట్టిగా పరిశీలిస్తే కింగ్ సైజ్ లైఫ్ ను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే క్యారవాన్ హాట్ టాపిక్ గ్గా మారింది.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో అత్యాధునిక సౌకర్యాలతో, హైటెక్ ఫీచర్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్యారవాన్ ను మెయింటెయిన్ చేశారు. దాని పేరు ఫాల్కన్. ఇక ఇప్పుడు మహేశ్ బాబు దానికి ధీటుగా అత్యధిక ధరతో వ్యానిటీ వ్యాన్ ను కొనుగోలు చేయడం విశేషం. ఈ వ్యాన్ తీసుకొని రెండు నెలలు గడుస్తోంది. ఇటీవల దాని ధర బయటకి వచ్చింది. అల్లు అర్జున్ ఫాల్కన్, బాలీవుడ్ స్టార్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ క్యారవాన్ వోల్వో 9BRల కంటే మహేశ్ బాబు వ్యానిటీ వ్యాన్ ఖరీదైనది తెలుపుతున్నారు.
ఏకంగా మహేశ్ బాబు రూ.8 కోట్లు ఖర్చు పెట్టారంట. అందులో ఇంటీరియర్ కోసమే రూ.2 కోట్లు ఖర్చు చేశారంటే మాములు విషయం కాదు. అందులో మినీ బెడ్ రూమ్. కిచెన్, వాష్ రూమ్. హాట్ కోల్డ్ వాటర్ ఫెసిలిటీ. రిఫ్రిజిరేటర్. శాటిలైట్ టెలివిజన్, మీటింగ్ రూమ్. ఫస్ట్ క్లాస్ ఫర్నీచర్, ఎంటర్ టైన్ మెంట్ సిస్టమ్. ఇలా ప్రతిది మహేశ్ బాబు అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేయించారంట. దాంతో ఖర్చు కూడా అదే స్థాయిలో ఉందని చెబుతున్నారు.
ఇక అల్లు అర్జున్ ఫాల్కన్ క్యారవాన్, షారుఖ్ ఖాన్ వోల్కో ల ధరలు ర.5 కోట్ల వరకు ఉంటాయని, కానీ మహేశ్ బాబు ఏకంగా 8 కోట్ల రూపాయలు క్యారవాన్ కే ఖర్చు చేయడం షాకింగ్ ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ కు అదే క్యారవాన్ లో వెళ్తూ వస్తున్నారంట. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నెక్ట్స్ సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











