ఎన్టీఆర్, నేను నమ్మి మోసపోయాం.. ఆ పెద్ద మనిషి వల్లే.. వార్ 2 డిజాస్టర్‌పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్

తన నటన, ఫైట్స్, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో టాలీవుడ్‌ స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్‌తో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన నటించిన చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తెలుగులో తానేంటో నిరూపించుకున్న ఎన్టీఆర్.. హిందీలోనూ అడుగుపెట్టి మార్కెట్ పెంచుకోవాలని భావించారు. దీనిలో భాగంగా ఆయన చేసిన చిత్రమే వార్ 2. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలవడంతో పాటు తారక్ బాలీవుడ్ ప్రస్థానానికి ఆదిలోనే నీళ్లు చల్లింది. వార్ 2ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వార్ 2 డిజాస్టర్‌పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

400 కోట్లతో వార్ 2
దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా వార్ 2 సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా... అశుతోష్ రాణా, అనిల్ కపూర్, దిశిత సెహగల్, వరుణ్ బదోలా, సోని రజ్దాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ 2కు సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Suryadevara Naga Vamsi sensational comments on Aditya Chopra for War 2 disaster

వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 105 కోట్లు)తో తెలుగు రాష్ట్రాలలో వార్ 2 థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలు, హిందీలో 175 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వార్ 2 మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

భారీ నష్టాలు తెచ్చిన వార్ 2
థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 236.55 కోట్ల రూపాయల నెట్... 282.6 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 82 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కలిపి మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 364.35 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. హిందీలో 177.59 కోట్ల రూపాయలు, తెలుగులో 56.74 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. డిస్ట్రిబ్యూషన్ మీద దాదాపుగా 150 కోట్ల రూపాయలు నష్టం రాగా.. ఓవరాల్ కలెక్షన్స్ మీద 300 కోట్లకు పైగా నష్టాలను తెచ్చిపెట్టింది వార్ 2. వార్ 2 డిజాస్టర్‌ కారణంగా నాగవంశీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోగా.. ఈ దెబ్బకు ఆయన ఏకంగా ఆస్తులు అమ్ముకుని దుబాయ్‌కి వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై నాగవంశీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు.

అక్టోబర్ 31న మాస్ జాతర
కాగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రవితేజ, శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 31న ఈ సినిమా వరల్డ్ వైడ్‌‌గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా హీరో రవితేజ, నాగవంశీ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో వార్ 2 డిజాస్టర్‌పై నాగవంశీకి ప్రశ్న ఎదురైంది.

నేను, ఎన్టీఆర్ అన్న మోసపోయాం
దీనికి ఆయన బదులిస్తూ... వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొంచెం ఎక్సైట్ అయ్యాను.. తప్పులు చేయకుండా ఉండం కదా? తప్పు జరిగింది ఏం చేస్తాం.. నేను అయినా, ఎన్టీఆర్ గారైనా ఆదిత్య చోప్రా లాంటి పెద్దమనిషిని, యశ్ రాజ్‌ ఫిలింస్‌ని నమ్మాం. అందరూ తప్పులు చేస్తారు కదా? వాళ్ల సైడ్ తప్పు జరిగింది.. మనం దొరికిపోయాం అంతే ఏం చేస్తాం అని నాగవంశీ అన్నారు. నేను చేసిన సినిమా కాదు, వాళ్లని నమ్మాం. పెద్దమనిషిని.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ని నమ్మాం.. మిస్ ఫైర్ అయ్యింది ఏం చేస్తాం. ఏసుకున్నారు.. పడ్డాం అంతే. మనం తీసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాం హ్యాపీ. భయపడటం ఉండదు, నెగిటివిటీకి ఎదురెళ్లకూడదు. నేను ఎప్పుడు దొరుకుతానా? అని ఎదురుచూశారు.. బయటి సినిమాకు దొరికాం, సో ఏస్కుంటున్నారు కదా అని వాళ్లకి ఎదురెళ్లకుండా తగ్గి ఉండటం బెటర్ అని నాగవంశీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X