twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్నే సినిమా రిలీజ్.. సినిమా చూడొద్దంటూ దర్శకుడు సంచలనం.. రౌడీలతో ఎటాక్?

    |

    సాధారణంగా ఏ దర్శకుడైనా తన సినిమాను చూసి తనను ఆదరించాలని ఆ సినిమా విజయవంతం చేయాలని కోరుతూ ఉంటాడు. కానీ ఒక దర్శకుడు మాత్రం తన సినిమా చూడొద్దని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం సంచలనం రేపుతోంది. అసలు ఎవరు ఆ దర్శకుడు ? ఏమిటి ఆ సినిమా అనే వివరాల్లోకి వెళితే

    దర్శకుడు vs నిర్మాత

    దర్శకుడు vs నిర్మాత

    తెలుగులో సూర్యాస్తమయం అనే సినిమా ఆగస్టు 27 వ తారీఖున విడుదలైంది. బండి సరోజ్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, హిమాన్సీ కాట్రగడ్డ, కావ్య సురేష్, డేనియల్ బాలాజీ, డైరెక్టర్ వంశీ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పేరు తెచ్చుకుంతుంది అని నిర్మాతలు చెబుతున్నారు.. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో తాను చేసిన అన్ని సీన్లు పెట్టలేదని తన క్రియేటివ్ నెస్ ని వాడుకోకుండా తన అవమానిస్తున్నారంటూ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బండి సరోజ్ కుమార్ అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు.

    మా సినిమా చూడొద్దు

    మా సినిమా చూడొద్దు

    అంతేకాక ఈ సినిమా చూడొద్దు, ఇది నేను అనుకున్న సినిమా ఇది కాదు, త్వరలోనే కోర్టుకు వెళుతున్న కోర్టుకు వెళ్ళాక నేను చేసిన పూర్తి సినిమా మళ్ళీ విడుదల అవుతుంది అంటూ దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా పేర్కొనడంతో ఈ సినిమా విడుదల చేసిన నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి దర్శకుడి మీద విరుచుకు పడ్డారు. బండి సరోజ్ కుమార్ ఫేస్బుక్ ద్వారా ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఫేస్బుక్ లిస్టులో ఉన్న మూడు వేలు నాలుగు వేలమంది ప్రభావితం అయినా సరే ఈ సినిమా విషయంలో నిజం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తాము ముందుకు వచ్చి చెబుతున్నామని వారు చెబుతున్నారు.

    అన్నీ నేనే చేస్తే

    అన్నీ నేనే చేస్తే

    కానీ బండి సరోజ్ కుమార్ మాత్రం ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ తానేనని చెబుతున్నారు. రఘు అనే వ్యక్తి ఈ సినిమాకి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే తాను ఫస్ట్ కాపీ బేసిస్ మీద సినిమా చేశానని తాను దర్శకత్వం, నటన, మ్యూజిక్ అందించడం, సినిమాటోగ్రఫీ ఇలా దాదాపు పదకొండు విభాగాల పని చేశానని సినిమా మీద ప్రేమతో తాను పని చేస్తే తణను అర్థం చేసుకోవాల్సింది పోయి సెన్సార్ అయిపోయిన సినిమాని కూడా మళ్ళీ రీ సెన్సార్ చేయించి విడుదల చేశారు అని తనకు చెప్పకుండా ఇలా చేయడం అంటే దర్శకుడిగా తన హక్కులను కాలరాయడమే అని ఆయన అంటున్నారు

    సినిమా అర్ధం కాలేదని అంటున్నారు

    సినిమా అర్ధం కాలేదని అంటున్నారు

    నిజానికి తాను మొదటి షో అలాగే మొదటి రోజు సినిమా చూడలేదని తాను నిర్బంధం అనే సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉంటే ఈ సినిమా చూసిన తన అభిమానులు కొందరు సినిమా చూసి ఏమీ అర్థం కావడం లేదు ఏంటి అన్నా అని అడుగుతుంటే తనకు ఈ విషయం తెలిసిందని సినిమాలో కీలకంగా భావించిన ఎనిమిది నిమిషాల సీన్లు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని సదరు దర్శకుడు వాపోతున్నారు. అంతేకాక ఈ విషయం మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాలని వస్తే రౌడీలను పంపించి కొట్టించడానికి కూడా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

    Recommended Video

    Suryasthamayam Movie Impresses Producer Raj Kandukuri
    వాళ్ళ మీద కేసులు

    వాళ్ళ మీద కేసులు

    వీళ్లతో సినిమా చేస్తున్న 10 రోజుల్లోనే తనకు వీరి సంగతి ఏంటో తెలిసింది అని గతంలో డైరెక్టర్లను కొట్టే వాళ్ళమని, వాళ్ళ చేత కాళ్లు పట్టించుకున్నామని వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళతో జాగ్రత్త గానే ఉన్నాను అని చెప్పుకొచ్చారు.. ఇక ఈ సినిమాకు రీ సెన్సార్ చేసిన సెన్సార్ బోర్డును ఒక ఎడిటర్ పనిచేసిన సినిమాకి మళ్ళీ పనిచేసిన ఎడిటర్ మీద కేసు పెట్టబోతున్నానని దర్శకుడు సరోజ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం సోషల్ మీడియా తో పాటు టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది అని చెప్పక తప్పదు.

    English summary
    Suryasthamayam movie released on 27th august. and controversy between bandi saroj kumar and producers arose.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X