సూర్య ఇంటి పనిమనిషే లక్షల్లో టోకరా.. ఎన్ని లక్షలు? చెన్నై‌లో కోట్లల్లో స్కామ్

కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తమిళంతో పాటు తెలుగు ఆడియెన్స్ లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. 20 ఏళ్ల కిందనే గజినీ చిత్రంతో ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ మరింత ఇంట్రెస్టింగ్ సినిమాలతో థియేటర్లలోకి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

దీంతో సూర్యకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కాగా సూర్యకు సంబంధించిన ఎలాంటి వార్తనైనా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్ సూర్య నివసిస్తున్న ఇంట్లో నగదు మోసం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాన మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. తన ఇంటి పని మనుషులే లక్షల్లో నగదు మోసానికి పాల్పడ్డారని, ఈ విషయం పోలీసులకు కూడా తెలియడంతో నలుగురిని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Tamil Star Suriya Personal Security Officer Duped RS 42 Lakhs by Workers

వివరాల్లోకి వెళితే.. సూర్య దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆంథోనీ జార్జ్ ప్రభు రూ.42 లక్షలు మోసపోయారు. ఈ కుంభకోణంలో సూర్య ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. అయితే కొంత డబ్బు పెట్టుబడి పెడితే అధిక రాబడి లభిస్తుందని, పలు స్కీమ్‌ల పేర్లతో అతన్ని నమ్మించి, హామీనిచ్చి ఆంథోనీ డబ్బును లాగడం ప్రారంభించారు. అలా కొంత కాలంగా లక్షల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వస్తున్నాడాయన. మరోవైపు ఆంథోనీకి అనుమానం రాకుండా వాళ్లు మధ్యమధ్యలో కొంత అధిక లాభం వచ్చినట్టుగా డబ్బులు తిరిగి ఇస్తూ వచ్చారు. ఇలా కేవలం కేవలం 2 నెలల్లోనే 2025 జనవరి, ఫిబ్రవరి మధ్య రూ.42 లక్షలు నగదును వారికి బదులు చేశాడు.

ఆ తర్వాత సూర్య ఇంట్లో పని మనుషులుగా చేస్తున్న సులోచన, ఆమె కొడుకును మార్చి నుంచి డబ్బులు అడగటం ప్రారంభించాడు. కానీ వారు తిరిగి ఇవ్వలేదు. పైగా తల్లికొడుతో పాటు మరో ఇద్దరు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తానికి వాళ్ల చేతిలో మోస పోయానని తెలుసుకున్న ఆంథోనీ పోలీసులను ఆశ్రయించాడు. ఇక చెన్నై పోలీసులు ఆంథోనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆర్థిక కుంభకోణం చెన్నై అంతటా ఉందని, పలు కేసులు నమోదు అవుతూనే వస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో చెన్సైలో మొత్తం రూ.2 కోట్ల నగదు స్కామ్ జరిగిందని, అనేక కుటుంబాలు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని తెలియజేశారు.

ప్రస్తుతం పోలీసులు సులోచన, బాలాజీ, భాస్కర్, విజయలక్ష్మిలను అరెస్టు చేశారు. వీరు గతంలో సూర్య నివాసంలో ఇంటి పనిమనిషులుగా ఉన్నారు. దీంతో ఆంథోనీ వారిని ఈజీగా నమ్మాల్సి వచ్చింది. ఇంతకీ వాళ్లు ఎలా స్కామ్ చేశారనే వివరాలు పూర్తి తెలియాల్సి ఉంది. ఇక సూర్య రీసెంట్ గా రెట్రో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెక్ట్స్ కురుప్పు, సూర్య 46 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: suriya kollywood Retro movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X