For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చట్నీస్‌లో మెగాస్టార్ చిరంజీవి దోశ ఫేమస్.. ‘తెలిసినవాళ్ల‌ు’ అందరికీ చెప్పేశారా గురూ..!

  |

  చిన్నపాము అయినా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. సినిమా చిన్నదైనా విలక్షణమైన కథ, యూత్‌ను, ఫ్యామిలీని మెప్పించే కథ ఉంటే.. ప్రమోషన్ అనే పెద్ద కర్రతోనే సాము చేయాల్సిందే అంటారు సినీ పెద్దలు. సినిమా చిన్నది కానీ, పెద్దది కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ప్రమోషన్‌ను వినూత్న తరహాలో చేయాల్సిందే. అప్పుడే ప్రేక్షకుల హృదయాలకు సినిమా చేరువ అవుతుందని 'తెలిసిన వాళ్లు' చిత్ర యూనిట్ మూవీ నిరూపిస్తున్నది. విభిన్నమైన కథ, క్రేజీగా ప్రమోషన్‌ను తెలిసిన వాళ్లు మూవీ నిర్మాత, దర్శకులు చేయడం ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

  ఇటీవల విడుదల చేసిన తెలిసిన వాళ్లు సినిమా ఫస్ట్‌లుక్‌కు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వచ్చింది. ఫీల్‌గుడ్ కథ, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిరెంజ్ సినిమా బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తున్నది. కేఎస్‌వీ ఫిలిమ్స్ సమర్పణలో విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో తెలిసిన వాళ్లు చిత్రం రూపొందుతున్నది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. వినగానే ఆకట్టుకునే టైటిల్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రామ్ కార్తీక్ విడుదల చేశారు. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ప్రారంభిస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది.

  Telisinavallu movie promotion started high note: Ram Karthik first look goes viral

  నిర్మాత, దర్శకుడు విప్లవ్ కోనేటి మాట్లాడుతూ... తెలిసిన వాళ్లు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న హెబ్బా పటేల్ ఫస్ట్ లుక్‌ను గతంలో విడుదల చేయగా బ్రహ్మండమైన ఆదరణ లభించింది. తాజాగా హీరో రామ్ కార్తీక్ లుక్ కూడా మంచి స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్, విడుదల వాయిదా పడింది. అన్ని సినిమాల మాదిరిగానే మా చిత్ర షూటింగ్ ఆగిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాం. మా సినిమాకు రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణ. ఇతర నటీనటులు పెర్ఫార్మెన్స్, టెక్నిషియన్స్ ప్రతిభ సినిమాను మరింత క్వాలిటీగా మార్చింది. ఫిలిం స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని టాలెంట్ నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్న సాంకేతిక నిపుణులు అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు అని అన్నారు.

  తెలిసిన వాళ్లు చిత్రం ఒక సాంగ్ మినహా దాదాపుగా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన పది శాతం చివరి షెడ్యూల్‌లో పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమైంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం అని విప్లవ్ కోనేటి అన్నారు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు
  రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు
  నిర్మాత, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి
  సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్, సిరెంజ్ సినిమా
  సినిమాటోగ్రఫి: అజయ్ వి నాగ్
  ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
  మ్యూజిక్: దీపక్ వేణుగోపాలన్
  లిరిక్స్: డాక్టర్ జివాగో
  ఆర్ట్: ఉపేందర్ రెడ్డి
  కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, శైలజ మాస్టర్
  ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ
  లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ
  కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావు
  పీఆర్వో : మధు వీ.ఆర్
  డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం, ధీరజ్

  English summary
  Telisinavallu movie promotion started high note. Hero Ram Karthik first look goes viral in social media. Earlier Hebba Patel look went trending on variaous platforms.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X