Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
65వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన విజయ్.. మురగదాస్‌తో కాదట
కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సారి మాత్రం ఒక హిట్ కాంబో అనుకోకుండా క్యాన్సిల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు మురగదాస్ హీరో విజయ్ కాంబోలో వచ్చిన సినిమాలు కోలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఆల్ మోస్ట్ ఓకే అయ్యిందనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు క్లారిటీ వచ్చేసింది.
We are happy to announce Thalapathy @actorvijay ’s #Thalapathy65bySunPictures directed by @nelsondilpkumar and music by @anirudhofficial #Thalapathy65 pic.twitter.com/7Gxg1uwy22
— Sun Pictures (@sunpictures) December 10, 2020
మురగదాస్ ను కాదని విజయ్ ఒక యువ దర్శకుడు చెప్పిన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రోబో వంటి హిట్ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ విజయ్ 65వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఇక దర్శకుడు ఏవరంటే.. నయనతారతో కోలమావు కోకిల, శివకార్తికేయన్ తో డాక్టర్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్. ఈ యంగ్ డైరెక్టర్ గత కొంతకాలంగా సన్ పిక్చర్స్ లో ఒక సినిమాను నిర్మిస్తున్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి.

అసలైతే విజయ్ 65వ సినిమా మురగదాస్ దర్శకత్వంలోనే రావాల్సింది. అందుకు సన్ పిక్చర్స్ కూడా ఒప్పుకుంది. కానీ ఇదే ప్రొడక్షన్ లో మురగదాస్ ఇంతకుముందు చేసిన దర్బార్ అనుకున్నంతగా ఆడలేదు. ఇక ఈ సారి కథ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడంతో దర్శకుడు తప్పుకున్నట్లు సమాచారం. ఇక విజయ్ తో అనుకున్న కమిట్మెంట్ ప్రకారం సినిమా చేయాలి కాబట్టి దిలీప్ కుమార్ చేత కథ వినిపించింది. ఆ కథకు నేడు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది సన్ పిక్చర్స్.