Just In
- 35 min ago
నాగబాబు జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యం లీక్: రీఎంట్రీపై షాకింగ్ రియాక్షన్.. ఊహించని పేరు చెప్పి!
- 45 min ago
ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ హీరోయిన్.. మరోసారి ఆ బ్యూటీతో కొరటాల!
- 1 hr ago
బాలకృష్ణను హరికృష్ణ పూనాడా? 'అఖండ'గా యూట్యూబ్ దుమ్ము దులిపేస్తున్న బాలయ్య!
- 1 hr ago
శంకర్ సంచలనాత్మక నిర్ణయం.. బాలీవుడ్ హీరోతో మరో అపరిచితుడు.. రాబోయేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మహారాష్ట్రలో కర్ఫ్యూ- స్వస్ధలాలకు వలస కార్మికుల క్యూ- మళ్లీ మొదలైన వెతలు
- Finance
వరుసగా 4వ ఏడాది: మారుతీ దూకుడు, అత్యధికంగా అమ్మడైన 5 కార్లు ఇవే
- Sports
KKR vs MI: చెత్త ప్రదర్శన ఇది.. అభిమానులు క్షమించండి: షారుక్ ఖాన్
- Automobiles
మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!
- Lifestyle
వెరైటీగా చికెన్ టేస్ట్ చూడాలనుకుంటే చికెన్ టిక్కా మసాలా రిసిపి ట్రై చేయండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన థమన్: అప్పుడు కలుద్దాం అంటూ పోస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - పరశురాం కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. అందులో హీరో పరిచయ సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్స్ ఛేజింగ్ సీక్వెన్స్‌లు, నటీ నటుల మధ్య కీలకమైన సీన్స్‌ను తెరకెక్కించారు. త్వరలోనే రెండో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజాగా సోషల్ మీడియాలో మహేశ్ బాబు అభిమాని ఒకరు.. 'హాయ్ అన్నా.. సర్కారు వారి పాట ట్యూన్స్ అంచనాలకు తగ్గవని ఓ ప్రామిస్ చెయ్. రిప్లై ఇస్తే వచ్చే తృప్తి కన్నా.. ఆ ప్రామిస్ నిజం చేస్తే వచ్చే తృప్తి ఓ రేంజ్‌లో ఉంటుంది' అని మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు ట్వీట్ చేశాడు. ఇది అతడి దృష్టికి వెళ్లడంతో 'ఆగస్టులో కలుద్దాం బ్రదర్' అంటూ వెంటనే రిప్లై ఇచ్చాడు. దీంతో ట్వీట్ చేసిన అభిమానితో పాటు మిగిలిన వారంతా ఖుషీ అవుతున్నారు. థమన్ చెప్పిన దాని ప్రకారం.. ఆగస్టు నుంచి 'సర్కారు వారి పాట' సాంగ్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది.
