National Film Awards: థమన్ ఫస్ట్ రియాక్షన్.. ఢిల్లీ నుంచి అవార్డు తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టేస్తా!
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన రాగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది సినీ ప్రముఖులు థమన్ కు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన 'అల..వైకుంఠపురములో' సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఆ సినిమా లో మ్యూజిక్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఒక విధంగా సినిమా విడుదల కంటే ముందే సంగీత దర్శకుడు థమన్ మంచి మ్యూజిక్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. ఇక సినిమా విడుదల కాగానే భారీ స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అదే సినిమాకు గాను థమన్నాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు సొంతం చేసుకుంటూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ సినిమాకు తప్పకుండా ఏదో ఒక కేటగిరీలో మంచి గుర్తింపు లభిస్తుంది అని ముందు నుంచి అభిమానుల్లో ఒక నమ్మకం అయితే ఉంది. ఇక ఊహించని విధంగా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు లభించడం విశేషం. ఇక అవార్డు ప్రకటన రాగానే తమన్ ఒకే ఒక్క సమాధానంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'ఢిల్లీ వెళ్లి అవార్డు తీసుకుని వచ్చి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఇంట్లో పెట్టి చెన్నయ్ వెళ్లిపోతాను..అవార్డు ఆయనదే..' అని థమన్ వివరణ ఇచ్చారు.
ఇది వరకే చాలా ఇంటర్వ్యూలలో థమన్ ఈ సినిమాలో అద్భుతమైన పాటలు రావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని ఆయన సపోర్ట్ చేయడం వల్లనే మ్యూజిక్ చాలా బాగా వచ్చింది అని అన్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం గురించి ఆయన నాతో మాట్లాడడం అలాగే ఆ తర్వాత లిరిక్స్ విషయంలో గానీ పాట కంపోజింగ్ విషయంలో కానీ సుదీర్ఘంగా చర్చలు జరపడం వలన అంత మంచి మ్యూజిక్ వచ్చింది అని కూడా థమన్ వివరణ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచే తన సరికొత్త కెరీర్ కూడా మొదలైంది అని ఈ సంగత దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం త్రివిక్రమ్ అంటూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications