సినీ లవర్స్ కి గుడ్ న్యూస్.. పండగ చేసుకునే న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గత కొద్ది రోజుల క్రితం వరకు అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలను కూడా భయపెట్టిన కరోనా మహమ్మారి రెండో దశ ఇప్పుడు నెమ్మదించిందనే చెప్పాలి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణాలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేయగా ఏపీలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతోంది. తాజాగా సినిమా ప్రియులకి తెలంగాణా ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే

థియేటర్లకు అనుమతి

థియేటర్లకు అనుమతి

తెలంగాణలో దాదాపుగా అన్ని సడలింపులు ఇచ్చారు. తాజాగా తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

23 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్

23 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్

ఇక మంత్రి హామీతో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు రన్ చేయాలని కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతోనే తెలంగాణ అంతటా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తోతెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

సాధారణ పరిస్థితులు నెలకొనడంతో

సాధారణ పరిస్థితులు నెలకొనడంతో

మళ్ళీ తెలంగాణలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కోరారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ నిర్మాతలు, తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు అనుమతులు ఇచ్చింది.

మంత్రి హామీతో

మంత్రి హామీతో


సినిమా థియేటర్ల పునః ప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లను ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23 నుంచి సినిమాలు రిలీజ్ చేయించేలా ప్లాన్ చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.

Recommended Video

OTT vs Theatres : ప్రేక్షకుల మూడ్ బట్టి సినిమాలు ఆడుతున్నాయి | Tollywood || Filmibeat Telugu
ఆ విషయాలు కూడా

ఆ విషయాలు కూడా

ఇక ఇదే కాక 2017లో తీసుకొచ్చిన జీఓ.75 విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని కూడా వారు కోరారు. అలాగే థియేటర్‌కు వచ్చే వాహనదారుల నుంచి పార్కింగ్‌ రుసుము వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. లాక్‌ డౌన్‌ సమయంలో థియేటర్లు అన్ని మూతపడి ఉన్నా మినిమం కరెంట్ చార్జీలు వేసారని ఆ విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X