Dr Rajasekhar కుటుంబంలో విషాదం.. సినీ ప్రముఖులు, సన్నిహితుల పరామర్శ

టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, సినీ హీరో డాక్టర్ రాజశేఖర్‌ కుటుంబంలో విషాదం నెలకొన్నది. దీపావళీ పండుగ రోజున వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాజశేఖర్ తండ్రి తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం (నవంబర్ 4 తేదీ) సాయంత్రం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. దాంతో రాజశేఖర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పితృవియోగంతో విషాదంలో నెలకొన్న రాజశేఖర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు సంతాపం తెలియజేశారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్, ఆయన కుటుంబానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Tollywood actor Dr. Rajasekhars Father Varadarajan Gopal died at 93

వరదరాజన్ గోపాల్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆయన సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్‌ గోపాల్‌ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

వరదరాజన్‌ గోపాల్‌ చెన్పై డీసీపీగా రిటైర్‌ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్‌ గోపాల్‌కు హీరో రాజశేఖర్‌ రెండో సంతానం.

రాజశేఖర్ తండ్రి వరదరాజన్ మరణించారనే విషాద వార్త తెలియగానే వారి సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు ఫోన్ చేసి పరామర్శించారు. మరికొందరు వారిని కలిసి ఓదార్చారు. వరద రాజన్ గోపాల్ ఆత్మకు శాంతి కలుగాలని, రాజశేఖర్ కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని పలువురు ప్రార్థించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X