For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇంట్లో పెను విషాదం.. అప్పుడు తండ్రి ఇప్పుడు తల్లి

  |

  సినీ ఇండస్ట్రీల్లో ఈ మధ్య కాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కారణాలతో నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పాటు ఈ రంగంతో సంబంధం ఉన్న ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక, కరోనా వైరస్ ప్రభావం వల్ల మరికొందరు చనిపోయారు. దీంతో కొంత కాలంగా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. దీంతో ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చేదువార్తలను వినాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా పేరొందిన ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇంట్లో విషాదకర సంఘటన జరిగింది.

  Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

  టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ తల్లి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ శైలజ అత్తగారైన ఎస్ఎస్ కాంతం మంగళవారం రాత్రి కన్నుమూశారు. 82 ఏళ్ల ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం గుండెపోటుకు కూడా గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సను కూడా అందించారు. దీని నుంచి కోలుకున్నప్పటికీ వయోభారం కావడంతో కాంతం పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో ఈమె తుదిశ్వాసను విడిచినట్లు తెలుస్తోంది.

  Tollywood Actor Subhalekha Sudhakar Mother Passes Away

  శుభలేఖ సుధాకర్ తల్లి ఎస్ఎస్ కాంతం తమిళనాడులోని మహాలింగాపురంలో తన భర్త కృష్ణారావుతో కలిసి నివసించేవారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ఆయన కూడా అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అప్పటి నుంచి కాంతం కూడా తరచూ ఏదో ఒక సమస్యతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో శుభలేఖ సుధాకర్ పెద్దవాడు. ఇక, ఆమె మరణంపై దక్షిణాదికి చెందిన పరిశ్రమల సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో వింత ట్రాక్.. అతడిపై మనసు పడ్డ ప్రియాంక.. అందరి ముందే ఆ మాట!

  సుధాకర్‌ అసలు పేరు సూరావజ్జల సుధాకర్. కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'శుభలేఖ' అనే చిత్రంలో నటించడంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. ఈ మూవీలో చిరంజీవి - సుమలత హీరో, హీరోయిన్లుగా నటించగా.. సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అలాగే, బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నో సీరియళ్లలోనూ నటించి మెప్పించారు. ఇక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్పీ శైలజను శుభలేఖ సుధాకర్ పెళ్లాడారు. వీళ్లిద్దరూ సుదీర్ఘ కాలంగా తమ తమ రంగాల్లో సత్తా చాటుతున్నారు.

  శుభలేఖ సుధాకర్ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళం, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించారు. అలాగే, ఎన్నో సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పని చేశారు. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయన ఎన్నో అవార్డులను, పురస్కారాలను సైతం అందుకున్నారు. ఇప్పటికీ చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ హవాను చూపిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తల్లిని కోల్పోయారు.

  English summary
  Tollywood Senior Actor Subhalekha Sudhakar Mother, Famous Singer S. P. Sailaja Mother In Law SS Kantham passed away on Tuesday at his residence.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X