RIP Kathi Mahesh: త్వరగా వెళ్ళిపోయారేంటి? మీకు న్యాయమా? స్నేహితులు, సన్నిహితుల కంటతడి

తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటుడు సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే.. 2 వారాల క్రితం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన ముఖానికి తీవ్రగాయాలు కావడంతో ముందు నెల్లూరు జిల్లా ఆస్పత్రిలో ఆ తర్వాత చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చాలా షాకింగ్

చాలా షాకింగ్

అయితే ఆమె తిరిగి వస్తారని అందులో భావిస్తున్న తరుణంలో ఆయన కన్నుమూయడం సంచలనం రేపుతోంది. అయితే ఆయన మరణించడంతో ఆయనతో అనుబంధం ఉన్న సినీ నటులు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ముందుగా హీరో నాని దీనికి సంబంధించి ట్వీట్ చేశారు.. కత్తి మహేష్ చనిపోయారని తెలియడం చాలా షాకింగ్ అనిపించింది అని చెప్పుకొచ్చారు.

సినిమాలని ఎంకరేజ్ చేస్తూ

సినిమాలని ఎంకరేజ్ చేస్తూ

అలాగే తాను చూసిన దాని ప్రకారం ఆయన తన కంటెంట్ రైటింగ్ తో రివ్యూ లతో సినిమాలని ఎంకరేజ్ చేస్తూ ఉండడానికి కనిపించే వాడని ఆయన మరణంతో బాధపడుతున్న కుటుంబానికి, స్నేహితులకు బలం చేకూరాలని చెప్పుకొచ్చాడు. ఇక కత్తి మహేష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులు గడిపిన ఆదర్శ్ బాలకృష్ణ మాట్లాడుతూ కత్తి మహేష్ తో బిగ్ బాస్ హౌస్ లో చాలా సమయం గడిపానని చెప్పుకొచ్చారు.

అపారమైన జ్ఞానం

అపారమైన జ్ఞానం

ఆయనకు అపారమైన జ్ఞానం ఉందని ఆసక్తికరమైన ఐడియాలజీలతో ఉండేవాడని చెప్పుకొచ్చారు.. చాలా త్వరగా దేవుడి దగ్గరికి వెళ్లి పోయాడు అని పేర్కొన్న ఆయన ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్స్ అందిస్తూ ఉండే రమేష్ బాల కూడా తెలుగు పాపులర్ మూవీ క్రిటిక్ నటుడు కత్తి మహేష్ లేరని నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం ఆయన చెన్నై లో చికిత్స పొందుతూ మరణించారు అని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు.

ధైర్యం అందించాలని

ధైర్యం అందించాలని


ఇక నటి అనన్య నాగల్ల స్పందిస్తూ కత్తి మహేష్ మరణం గురించి విని చాలా ఆవేదనకు గురి అయ్యాను అని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని చెప్పుకొచ్చింది. ఇక మంచు మనోజ్ కూడా ఇదే విధంగా ట్వీట్ చేశారు ఆయన మరణం గురించి విని షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు.. ఆయన కుటుంబానికి ధైర్యం అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను చెప్పుకొచ్చారు.

Recommended Video

Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
కత్తి గారు మిస్ అవుతున్నా

కత్తి గారు మిస్ అవుతున్నా


ఇక కత్తి మహేష్ ని నటుడిగా పరిచయం చేసిన కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేష్ స్పందిస్తూ కత్తి ఇక లేడని మేమిద్దరం పోట్లాడుకుంటూ ఉన్నా సరే మా జర్నీ ఎలా మొదలైందో నాకు గుర్తుంది అని చెప్పుకొచ్చారు. ఆయనని మిమ్మల్ని యాక్టర్ గా పరిచయం చేసింది నేనే, మీ హెల్పింగ్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే మీ స్నేహం కూడా పొందినందుకు ధన్యవాదాలు, కత్తి గారు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పుకొచ్చారు. కత్తి మహేష్ తో ఉన్న ఒక ఫోటో షేర్ చేసిన ఆయన కొబ్బరి మట్ట, హృదయ కాలేయం సినిమా షూట్ మెమోరీస్ గుర్తుకొస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X