World Environment Day 2021: మన తల్లిని కాపాడుకుందాం... గళమెత్తిన టాలీవుడ్ హీరోలు
ఈరోజు ప్రపంచమంతా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ పర్యావరణం కూడా కాలుష్యం అయిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది పర్యావరణ పరిరక్షణ గురించి అనేక సందేశాలు ఇస్తున్నారు. ఈరోజు టాలీవుడ్ హీరోలు సైతం పర్యావరణం గురించి పర్యావరణ పరిరక్షణ గురించి సందేశం ఇచ్చారు. ముందుగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందేశాన్ని ఇచ్చారు. "పర్యావరణానికి అనుకూలమైన అలవాట్లను అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతితో కలిసిపోతూ, అది ఏం చేసినా అభినందించాలని కోరాడు.
ముందు తరాల కోసం.. ఈ భూగ్రహాన్ని మరింత పచ్చగా మారుద్దామని పేర్కోన్నారు. గ్రీనరీ కోసం ప్రతి ఒక్కరు చొరవ తీసుకుని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మొక్కలు నాటిన బన్నీ, అభిమానులు నాటిన మొక్కలు కూడా తనతో పంచుకోవాలని కోరాడు. ఇక మహేశ్ బాబు కూడా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మరింత అధ్వాన్నంగా మారేందుకు దగ్గరగా ఉన్న పర్యావరణ వ్యవస్థలను పున రూపకల్పన చేయడానికి పున సృష్టి చేయడానికి, మరియు పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ చేయాలని కోరాడు.

ప్రతి రోజూ మన గ్రహం పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం అని ఆయన కోరారు. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా దీని గురించి ట్వీట్ చేశారు. మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి - దానిని నాశనం చేయడాన్ని ఆపివేద్దాం అలాగే ఇంకా దానికి బదులు నయం చేయడానికి సమయం ఇద్దాం అని అన్నారు. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున మనం చూడాలనుకుంటున్న మార్పు గురించి ఆలోచిద్దామని అందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందామని అన్నారు.


Click it and Unblock the Notifications











