For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prudhvi Raj : ఆడియో లీక్ తర్వాత నాగబాబు అలా.. నా దేవత నిర్మాత నేను డైరెక్టర్ గా సినిమా!

  |

  30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పేరుతో పృథ్వీరాజ్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.. తెలుగులో అనేక సినిమాల్లో కామెడీ పాత్రలకు మంచి పేరు సంపాదించిన పృథ్వీరాజ్ ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి సపోర్ట్ చేసి ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుకు కృషి చేశారు. పార్టీ గెలిచిన తర్వాత ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవి లభించింది.

  అయితే ఆయన ఒక మహిళతో అసభ్యకరంగా పదజాలం వాడుతున్నట్లు ఉన్న ఒక ఆడియో లీక్ కావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దాని గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  చైర్మన్ పదవి

  చైర్మన్ పదవి

  30 ఇయర్స్ పృథ్విగా అందరికీ సుపరిచితమైన పృథ్వీరాజ్ బాలిరెడ్డి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు ఆ పార్టీ కోసం ఆయన అనేక నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసి ఆ పార్టీ గెలుపుకి కృషి చేశారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఆయనకు కీలకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవి లభించింది. అయితే కొద్ది కాలానికే ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

   కుట్ర చేసి

  కుట్ర చేసి

  ఎందుకంటే ఆయన అక్కడి ఒక ఉద్యోగినితో మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అయితే అది తన వాయిస్ కాదని పృథ్వీరాజ్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చుకోవడానికి ప్రయత్నించిన పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఆయన అప్పటికప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎన్నో సార్లు ఇందులో తన తప్పు లేదని కావాలని కుట్ర చేసి ఇరికించారని చెప్పుకొచ్చారు.

  ఆత్మహత్య చేసుకునేవాళ్ళు

  ఆత్మహత్య చేసుకునేవాళ్ళు

  అయితే తాజాగా ఈ విషయం జరిగిన తర్వాత నాగబాబు తనతో కొన్ని మాటలు అన్నారని ఆ వివరాలు పృథ్వి పంచుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పృథ్వీరాజ్ తాను ఆడియోలో మాట్లాడినట్లుగా ఉన్న దానిని పట్టుకుని ఎన్నిసార్లు ట్రోల్ చేశారని అన్నారు. ఒకవేళ తన స్థానంలో మరొకరు ఎవరైనా ఉండి ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ల కానీ తను గట్టివాడిని కాబట్టి అవన్నీ తట్టుకుని నిలబడ్డా అని అన్నాడు.

  ఆయన ఏమన్నారంటే

  ఆయన ఏమన్నారంటే

  వెనక నుండి వచ్చి పట్టుకుంటాను అనే మాటతో ఎన్నో స్కిట్లు కూడా చేశారని ఆయన అన్నారు.. ఇక నాగబాబు ఉండగా ఉగాది ఈవెంట్ కు వెళ్లానని ఆయన అప్పుడు తనతో ఈ విషయం పట్టించుకోవద్దని అన్నారు అని అన్నాడు. నీ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావాలని నీ టైమింగ్ అంటే మెగా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే అని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ వింటూ ఆలోచిస్తూ ఉంటే పని చేయలేమని అవన్నీ వదిలేయాలని ఆయన సలహా ఇచ్చారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

  ఆయన అలా అనడంతో

  ఆయన అలా అనడంతో

  ఆయన సలహా మేరకు ఆ విషయాలు ఏవీ తాను వంట పట్టించుకోలేదని అందుకే కాస్తోకూస్తో సినిమాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నా అని అన్నారు. ఇక మీరు త్వరలో దర్శక నిర్మాతగా మారుతున్న టాప్ యాంకర్ ప్రశ్నించగా ఆ విషయం మీద పృథ్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దర్శకుడిగా మారబోతున్న సంగతి నిజమే కానీ నిర్మాత మాత్రం తాను కాదని ఈ రోజు వెల్లడించారు.

  Cinema Bandi Trailer Review | బాహుబలి లా విజువల్ వండర్ కాదు ! || Filmibeat Telugu
  ఆవిడ నిర్మాతగా సినిమా

  ఆవిడ నిర్మాతగా సినిమా

  తాను ఈ ఆడియో వ్యవహారం తర్వాత మళ్ళీ మామూలు మనిషి కావడానికి ఒక ఆవిడ కారణం అని ఒక రకంగా ఆవిడ తనకు దేవత లాంటిది లాంటిది అని చెప్పుకొచ్చారు. ఆవిడ తన ఆస్తులు అన్నీ అమ్మయినా సరే మిమ్మల్ని దర్శకుడిగా చూడాలని మీరు దర్శకత్వం చేస్తానంటే తాను నిర్మాతగా మారి సినిమా చేస్తానన్నారు అని పృథ్వీరాజ్ వెల్లడించారు.

  దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైందని తెరకెక్కిస్తే గంటా పది నిమిషాల నిడివి వచ్చేలా ఉందని ఆయన వెల్లడించారు. అందుకే దీనికి సంబంధించిన మరిన్ని పనులు చేస్తున్నామని వీలైనంత త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందని ఆయన అన్నారు.

  English summary
  Tollywood Senior Actor Prudhvi Raj is getting ready to turn as director. he is going to announce his new movie soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X