Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఎనలేని గుర్తింపును అందుకున్న చలపతి రావు అంటే ఇండస్ట్రీలో అందరకీ చాలా దగ్గరైన వారు. ఇక ఆయన హఠాత్తుగా 78 ఏళ్ళ వయసులో ఆదివారం గుండెపోటుతో మరణించడం అందరిని షాక్ కు గురి చేసింది. చలపతి రావు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా నటుడిగా పలు మంచి చిత్రాలలో నటించారు.
చలపతి రావు అన్ని భాషల్లో కలుపుకొని తన సినిమా కెరీర్ లోనే మొత్తం పన్నెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఎలాంటి పాత్ర చేసినా కూడా ఆ పాత్రలో ఒడిగిపోయేలా నటించేవారు. చలపతి రావు కెరీర్ మొదట విలన్ పాత్రలతోనే మొదలయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116 తోనే ఆయన నట జీవితం స్టార్ట్ అయ్యింది. ఇక ఆ సినిమా అనంతరం ఆయన వెనక్కి తిరిగి చేసుకోలేదు. సీనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మూడు తరాల జనరేషన్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వచ్చారు.

ఇక చలపతి రావు 1944 మే 8వ తేదీన కృష్ణాజిల్లాలోని బల్లిపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన నటుడిగా బిజీగా మారిపోయిన తరువాత వివిధ రకాల పాత్రలు చేశారు. విలన్ గానే కాకుండా హీరోలకు తండ్రి పాత్రలు అలాగే కొన్ని కామెడీ రోల్స్ తో కూడా మెప్పించారు. ఇక చలపతిరావుకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
కూతుళ్లు ఇద్దరు కూడా అమెరికాలో స్థిరపడగా కొడుకు రవిబాబు మాత్రం ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక చలపతి రావు చివరగా గత ఏడాది ఓ మనిషి నివేవరు.. అనే సినిమాలో నటించారు. ఇక ఇటీవల ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ చనిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీ ఆ విషాదం నుంచి కొలుక ముందే చలపతి రావు మృతి చెందడం బాధాకరం. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు.