Don't Miss!
- News
lady manager: బ్యాంకులో రూ. కోట్లు గోల్ మాల్ చేసిన మేడమ్, రెండు బ్రాంచ్ లో ఏం చేసిందంటే ?
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఫిక్స్.. పక్కా ప్రూఫ్.. సోషల్ మీడియాలో వైరల్
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. కథ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది.. టైటిల్, ఫస్ట్ లుక్ అంటూ కొన్ని హల్ చల్ చేశాయి.. ఇలా ప్రతీవాటిని చిత్రయూనిట్ ఖండిస్తూనే వస్తోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది.. ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి.

సైరా ఆలస్యంతో కొరటాల మూవీ వెనక్కి..
భరత్ అనే నేను చిత్రం తరువాత చిరంజీవి కోసం కథ సిద్దం చేసుకున్న కొరటాల ఏడాదికి పైగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. సైరా చిత్రం ఆలస్యం అవుతూ ఉండటం మూలానా ఈ ప్రాజెక్ట్ అలా వెనక్కి వెళ్తూ వచ్చింది. ఎట్టకేలకు సైరా విడుదలై విజయవంతం కావడంతో ఈ మూవీకి లైక్ క్లియర్ అయింది.

అట్టహాసంగా పూజా కార్యక్రమాలు..
ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించేశారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. అయితే పూజా కార్యక్రమాలైతే ప్రారంభమయ్యాయి కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు పెట్టలేదు.

టైటిల్, ఫస్ట్ లుక్ వైరల్..
గోవింద ఆచార్య అంటూ ఓ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది అచ్చం అధికారిక పోస్టర్‌ను తలపించేలా ఉన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్. వెంటనే వాటిపై స్పందించిన కొణిదెల ప్రొడక్షన్స్.. అది అఫీషియల్ పోస్టర్ కాదని ఖండించింది.

మ్యూజిక్ సిట్టింగ్స్..
మెలోడి బ్రహ్మ చాలా ఏళ్ల తరువాత చిరు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చిత్రయూనిట్ బ్యాంకాక్ వెళ్లింది. మణిశర్మతో పాటు కొరటాల శివ అక్కడి సముద్ర తీరంలో కూర్చుని పాటలకు ట్యూన్ సెట్ చేస్తున్నారు.

హీరోయిన్ ఫిక్స్..
ఈ చిత్రంలో చిరు సరసన నయనతార, శ్రియా ఇలా ఎందరి పేర్లో వినిపించాయి. అయితే త్రిష చిరు పక్కన నటించబోతోందనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో అది రూమర్ అని కొందరు లైట్ తీసుకున్నా.. అదే ఇప్పుడు నిజమైంది.

పక్కా ప్రూఫ్..
త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదిహేడు సంవత్సరాలు గడుస్తున్నందుకు సోషల్ మీడియాలో ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ట్రేడ్ విశ్లేషకులు రమేష్ బాలా, రాజ శేఖర్ లాంటి వారు శుభాకాంక్షలు చెబుతూ 2020 కూడా త్రిషదే అన్నట్లు భవిష్యత్ ప్రాజెక్ట్‌లను చెప్పేశారు. వీటికి త్రిష కూడా రిప్లై ఇస్తూ.. ధన్యవాదాలు తెలిపింది. దీంతో చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఎవరన్నది తెలిసిపోయింది. ఇంతకు ముందు వీరిద్దరు స్టాలిన్ చిత్రంలో కలిసి నటించగా.. మళ్లీ ఇన్నేళ్లకు స్క్రీన్‌పై సందడి చేయనున్నారు.