For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak: మొన్న మౌనవ్రతం.. ఇప్పుడు పెదవి విప్పిన త్రివిక్రమ్.. సారీ అంటూ!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భీమ్లా నాయక్ మొదలు అయినప్పటి నుంచి నుంచి ప్రీ రిలీజ్ వరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైలెంట్ గా ఉన్నారు. ప్రీ రిలీజ్ వేడుకలో కూడా అసలు రాలేదు అనుకున్నారు కానీ చివరిలో కనిపించాడు. అయితే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనీసం మాట్లాడ లేదు. అయితే ఏదో జరిగింది అంటూ ప్రచారం జరగగా ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాత్రం ఆయన నోరు విప్పారు. ఆయన ఏం మాట్లాడారు? అనే వివరాలు తెలుసుకుందాం.

  ఘోస్ట్ డైరెక్టర్ గా కూడా

  ఘోస్ట్ డైరెక్టర్ గా కూడా

  పవన్ కళ్యాణ్ -రానా హీరోలుగా, నిత్య మీనన్-సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన భీమ్లా నాయక్ శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ లని రాబడుతూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి పడింది.

  ఈ సినిమాకు చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి అన్నీ తానయ్యారని ప్రచారం జరగడంతో అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఘోస్ట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు అనే ప్రచారం జరిగింది.

  పెద్ద సమస్య ఇదే

  పెద్ద సమస్య ఇదే

  భీమ్లా నాయక్ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ మొదలు కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. తాజాగా సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ కి త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర, సంయుక్త మీనన్, తమన్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ ప్రారంభించినప్పుడు తనకు ఎదురైన పెద్ద సమస్య ఇదేనని రివీల్ చేశారు.

   బ్యాలెన్సింగ్ గా ఉండేలా

  బ్యాలెన్సింగ్ గా ఉండేలా

  అదేమంటే అయ్యప్పనుమ్ కోషియం చిత్రం కోషి కోణంలో ఉంటుందని అంటే తెలుగులో అదే పాత్రని డానీగా రానా పోషించడంతో ఆ సినిమాను భీమ్లా కోణంలోకి మార్చడం పెద్ద తలనొప్పిగా మారిందని, అదే మాకు ఎదురైన పెద్ద ఛాలెంజ్ అని అన్నారు. అందుకే రీమేక్ చేస్తున్నాం అని భావించకుండా ఆ కథ నుంచి బయటకు వచ్చి ఆలోచించామని అన్నారు. అందుకే అడవి నేపథ్యం తీసుకుని కథ మొదలు పెట్టాం అని త్రివిక్రమ్ అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ని ఎలివేట్ చేయాలంటే సీన్స్ ఆర్టిఫీషియల్ గా ఉండకూడదని అందుకే బ్యాలెన్సింగ్ గా ఉండేలా చేసామని అన్నారు.

   సారీ చెప్పు

  సారీ చెప్పు


  ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని పేర్కొన్న 80వ-90వ దశకం నటుల కంటే ఇప్పటి జనరేషన్ నటులు సినిమాని, సినిమాలో ఉన్న అన్ని విభాగాలని అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. వెంటనే ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కొందరికి బాధ కలగవచ్చు అని అంటూ క్షమించమని కోరారు.

  నోరు విప్పడంతో

  నోరు విప్పడంతో

  అలాగే దర్శకుడు సాగర్ కి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన మొగిలయ్యనే ఎందుకు పిలిపించి పాడించాం అనే విషయాన్ని కూడా వెల్లడించారు. సంగీతం అందించిన తమన్ గురించి మాట్లాడుతూ ఈ మధ్య తమన్ సంగీతంతో మాట్లాడుతున్నాడని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత బాగా వచ్చింది అంటే అదే కారణం అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైలెన్స్ పాటించిన ఆయన ఈ విషయంలో నోరు విప్పడంతో అందరూ సంతోషిస్తున్నారు.

  English summary
  Trivikram speech at Bheemla Nayak Success Press Meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X