Just In
- 29 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 50 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 2 hrs ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- Sports
పిచ్‌ను నిదించడం సరికాదు: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల.. వైకుంఠపురములో సక్సెస్ మీట్: విశాఖ అమ్మాయిలపై త్రివిక్రమ్ కామెంట్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. భారీ రేంజ్ కలెక్షన్స్ రాబడుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది ఈ సినిమా. ఈ సందర్బంగా చిత్ర సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఆ వివరాలు చూద్దామా..

విశాఖ తీరాన బన్నీ టీమ్
'అల.. వైకుంఠపురములో' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం విశాఖను వేదికగా చేసుకుంది చిత్రయూనిట్. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు అల్లు అర్జున్ సహా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదికపై మాట్లాడిన యూనిట్ సభ్యులు ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆనందం కలిగించిన విషయం ఏమంటే..
ఇక ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరింత ఆసక్తికరంగా మాట్లాడుతూ వైజాగ్ ప్రేక్షకుల గొప్పతనాన్ని, అక్కడి అమ్మాయిల అందాన్ని ఆకాశానికెత్తారు. ''ఎంతో ఆనందం కలిగించిన విషయం ఏమంటే.. విలువలతో సినిమా తీయండి. మేమెలా ఆధరిస్తామో చూపిస్తాం! అని మీరంతా చెప్పారు. అదే మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. మాకే కాదు తెలుగు సినిమాకు కూడా నమ్మకాన్ని ఇచ్చింది'' అని ఆయన పేర్కొన్నారు.

అమ్మాయిలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్
ఆ తర్వాత విశాఖపట్నం నగరం గురించి, అక్కడి అమ్మాయిల గురించి మాట్లాడారు త్రివిక్రమ్. విశాఖపట్నం పేరు చెప్పగానే, తనకు వెంటనే ఇక్కడ ఉండే ఆంధ్రా యూనివర్శిటీతో పాటు, అందమైన అమ్మాయిలు గుర్తుకువస్తారని త్రివిక్రమ్ అన్నారు. విశాఖ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని సభా ముఖంగా ఆయన చెప్పారు.

ఎన్నో ఒంపు సొంపులున్న నగరం.. చాలా ఇష్టం
విశాఖ బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను ఇక్కడే శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రతులను పట్టుకుని రోడ్లపై తిరిగారని తెలిపారు త్రివిక్రమ్. ఈ నేల చలం, రావిశాస్త్రి, సీతారామశాస్త్రి వంటి ఎందరో మహానుభావులను అందించిందని పేర్కొంటూ విశాఖ నగర కీర్తిని వర్ణించారు. ఇది ఎన్నో ఒంపు సొంపులున్న అందమైన మహానగరమని అన్నారు. త్రివిక్రమ్ మాటలు వింటూ అభిమానులు, అక్కడి ప్రజలు హుషారెత్తిపోయారు.