Just In
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రివేంజ్ స్టోరీ.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీజర్
ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో తెరకెక్కించేందుక దర్శకనిర్మాతలు ఎప్పుడూ ముందుంటారు. ఎందుకంటే ఒకటోట వర్కౌట్ అయిన ఫార్మూలా మరోచోట మినిమమ్ గ్యారెంటీ అన్న ఆలోచనతో రీమేక్‌లపై దృష్టి పెడుతుంటారు. తెలుగు చిత్రాలు పక్క రాష్ట్రాల్లోకి, పక్క రాష్ట్రాల్లోని కథలు మనదగ్గరికి ఇలా వెళ్తూ వస్తుంటాయి. తాజాగా మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోంది.
మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన హిట్ చిత్రం 'మహేశింతే ప్రతీకారమ్' చిత్రానికి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ బాధ్యతలను కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహ తీసుకున్నాడు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. జ్యోతిలక్ష్మీ, బ్రోచెవారెవరురా సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు సత్యదేవ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
A story of revenge like none other! Here's the teaser of @ActorSatyadev and @mahaisnotanoun's#UmaMaheswaraUgraRoopasya... Release on April 17th! https://t.co/oLTGhexbMN@Shobu_ @paruchurimd #UMUR #UMUROnApr17th
— Arka Mediaworks (@arkamediaworks) February 21, 2020

చిన్న కుగ్రామం.. ఆ ఊర్లో ఓ ఫోటోగ్రాఫర్.. అతనికి ఓ ప్రేమకథ.. ఊర్లో ఏవో గొడవలున్నట్లు ఇలా ఎన్నో ఆలోచనలు, తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేకెత్తేలా టీజర్‌ను కట్ చేశారు. సత్యదేవ్ నటనే ఈ చిత్రానికి హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ లేనటు వంటి ప్రతీకార కథ అంటూ ఆర్కా మీడియా ట్వీట్ చేసింది. ఈ టీజర్‌పై రాజమౌళి వంటి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాకు బిజిబాల్ సంగీతాన్ని అందించాడు.