Don't Miss!
- News
Girl: అమ్మాయిని కిడ్నాప్ చేసి టీ తోటలో ఫ్రెండ్ తో కలిసి ?, ఎంతకాలం నుంచి స్కెచ్ వేశాడంటే ? క్లైమాక్స్ !
- Lifestyle
పిల్లలను మీజిల్స్, రుబెల్లా కాపాడుకోవడానికి ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోండి
- Finance
rbi repo: మళ్లీ పెరగనున్న వడ్డీరేట్లు.. రుణ గ్రహీతలకు మరోసారి వడ్డింపు షురూ !!
- Sports
Virat Kohli : కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్.. వీడిని ఆడటం చాలా కష్టమన్న విరాట్!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ranga Ranga Vaibhavanga: బటర్‌ఫ్లై కిస్‌తో వైష్ణవ్ తేజ్ రచ్చ.. అంచనాలు పెంచిన టీజర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతటి ప్రత్యేకమైన గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. సుదీర్ఘ కాలంగా ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే గత ఏడాది మరో హీరో కూడా వచ్చాడు. అతడే చిరంజీవి చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. చిన్నప్పుడు 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రంలో నటించిన అతడు.. బుచ్చిబాబు సన తెరకెక్కించిన 'ఉప్పెన' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, యాభై కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. దీంతో అతడికి గ్రాండ్ ఎంట్రీ దక్కింది.
మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ
ఇక, 'ఉప్పెన' మూవీ ప్రేక్షకుల ముందుకు రాకముందే మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రం 'కొండపొలం'ను ప్రారంభించాడు. ఆ వెంటనే అంటే చాలా తక్కువ రోజుల్లోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే, ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోడానికి చాలా సమయం తీసుకుంది. టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌లలో ఒకడైన క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే గ్రాండ్‌గా విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. దీంతో వైష్ణవ్ రెండో ప్రయత్నం నిరాశనే మిగిల్చింది.

ఒక సినిమాతో వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాతో నటుడిగా ఎంతో పరిణితి పొందినట్లు కనిపించాడు. ఇది విజయాన్ని అందుకోకున్నా అతడికి మాత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మొత్తంగా హీరోగా ఒక విజయం.. ఒక పరాజయం అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు మరిన్ని సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'రంగరంగ వైభవంగా' అనే సినిమాను చేస్తున్నాడు. గిరీశయ్య అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నాడు. ఇది ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ
వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలను లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో 'రంగరంగ వైభవంగా' మూవీ ఒకటి. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ఎంతో రొమాంటిక్‌గా కనిపించింది. ఇందులో హీరోయిన్ కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్‌కు బటర్‌ఫ్లై కిస్‌ను చూపిస్తుంది. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా యూత్‌ను ఇది బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.