twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌ పరిస్థితులపై విమర్శనాస్త్రం వలస మూవీ.. వలస కార్మికుల జీవితాలపై..

    |

    కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్ర బాబు నిర్మాణ సారథ్యంలో దర్శకుడు పీ సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన చిత్రం వలస. గతంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, సొంతవూరు, గంగపుత్రులు, గల్ఫ్ లాంటి చిత్రాలతో సామజిక అంశాలను ఎత్తి చూపిన సునీల్ కుమార్ రెడ్డి ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా చితికిన బతుకుల ఆధారంగా వలస చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన వలస కార్మికుల జీవితాలపై ఈ చిత్రాన్ని రూపొందించారు.

    వలస సినిమా పోస్టర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పని చేసి తాము నిర్మించిన ఈ నగరాలూ కూడా తమవేనన్న భావనతో ఉన్న వలస కార్మికులు, చిరు ఉద్యోగులు ఒక్క సారి కరోనా మహమ్మారి వల్ల విధించబడ్డ లాక్ డౌన్‌తో ఒంటరి వారైపోయారు. ఉపాధినిచ్చిన నగరాలు దినసరి జీవితాలకు అండగా ఉండకపోవడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో తమ తమ గ్రామాలకి పయనమయ్యారు. తమ సొంత గ్రామాలకు చేరుకోవడానికి రవాణా ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో వారు చేసిన పాదయాత్ర ఈ చిత్రం నేపథ్యం.! ఇది ఒక రోడ్ ఫిల్మ్. రోడ్డున పడ్డ శ్రామికుల కధ. వారి కలల కధ. వారి ఆవేదన.. వారి స్నేహం.. వారి ప్రేమ... వారికి ఎదురైన సంఘటనలు.. తారసపడ్డ మనుషులు....దేవతలు..రాక్షసుల దే ఈ కథ అన్నారు చిత్ర దర్శకుడు.

    Valasa movie based on Lockdown labour issues

    చిత్ర నిర్మాత యెక్కిలి రవీంద్రబాబు మాట్లాడుతూ వలస చిత్రం సమకాలీన చరిత్రకు అద్దం పడుతుంది. అంతేకాకుండా మంచి ప్రేమ కథను కూడా చూపిస్తుంది. సెన్సార్ కార్య‌క్రమాలని పూర్తి చేసుకొని అక్టోబర్ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను అని అన్నారు

    శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై గతంలో నిర్మించిన క్రైమ్ సీరీస్ లో ప్రేక్షకులకి సుపరిచితులైన మనోజ్ నందం, వినయ్ మహాదేవ్ కథానాయకుడు గా నటిస్తుండగా వారికి జోడి గా తేజు అనుపోజు, గౌరీ అనే ఇద్దరు తెలుగు అమ్మాయిలు కధానాయికలుగా పరిచయమవుతున్నారు. ఎఫ్ ఏం బాబాయ్, సముద్రం వెంకటేష్ , సన్నీ, తనూష డింపుల్ మనీషా మోగ్లీ , తులసి రామ్, మాస్టర్ ప్రణవ్ , మాస్టర్ సాజిద్, చిన్నారి, మల్లిక, వాసు, శేఖర్,వర ప్రసాద్, రమణి, నల్ల శీను, రామారావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

    కెమెరా, ఎడిటింగ్: నరేష్ కుమార్ మ‌డి
    సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
    సౌండ్: ప్రదీప్ చంద్ర, వీఎఫ్‌ఎక్స్, కలరింగ్: శ్యాం కుమార్, ఆడియోగ్రఫీ: పి పద్మారావు
    లిరిక్స్: మనోహర్,
    నేపథ్య గానం: ధనుంజయ్, మేఘ్న, ప్రసు
    సహా నిర్మాత: శరత్ ఆదిరెడ్డి.
    నిర్మాత : యెక్కిలి రవీంద్ర బాబు,
    రచన, దర్శకత్వం, పి. సునీల్ కుమార్ రెడ్డి.

    English summary
    Director P Suneel Kumar Reddy's Latest movie is Valasa. This movie is based on the Lockdown problems of Daily wage labour. This movie getting ready in theatres in october.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X