Don't Miss!
- News
YS విజయమ్మతో భేటీ అయిన అవినాష్ రెడ్డి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
పాన్ ఇండియా మూవీలో వరుణ్ సందేశ్: తొలిసారి అలాంటి పాత్రకు రెడీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సినిమాల రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అందులో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కూడా ఉంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు బహు భాషా చిత్రాలను మొదలు పెట్టేశారు. అలాగే, కొందరు చిన్న హీరోలు కూడా వాళ్ల బాటలోనే పయణిస్తున్నారు. అందులో అద్భుతమైన టాలెంట్‌తో టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయమై సరైన హిట్లు దొరకక ఇబ్బందులు పడుతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. చాలా కాలంగా విజయాన్ని అందుకోవడంలో విఫలం అవుతోన్న అతడు.. ఇప్పుడు ఏకంగా భారీ చిత్రమే చేస్తున్నాడు.
బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో రకాల చిత్రాల్లో నటించి తన టాలెంట్‌ను నిరూపించుకున్న సందీప్ కిషన్.. తమిళంలోనూ పలు మూవీల్లో కనిపించాడు. ఈ క్రమంలోనే అక్కడ కూడా సుపరిచితుడు అయ్యాడు. దీంతో అతడికి రెండు పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సందీప్ కిషన్ ఇప్పుడు ఏకంగా 'మైఖేల్' అనే ఓ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో ఈ యంగ్ హీరోతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు. రంజిత్ జయకోడి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'మైఖేల్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్‌లో దెబ్బలు తిని ఉన్న రెండు చేతులు కనిపిస్తున్నాయి. అందులో ఓ దానికి సంకెళ్లు ఉండగా.. మరో చేతిలో ఆయుధం ఉంది. దీంతో ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నట్లు కూడా ఈ పోస్టర్‌లో ప్రత్యేకంగా ప్రకటించారు. తద్వారా ఈ ప్రాజెక్టుపై అంచనాలను అమాంతం పెంచేశారు.
Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!

క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'మైఖేల్' మూవీ గురించి తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే ప్రకటన చేసింది. ఈ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ కూడా నటిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో మామూలు ఫొటోనే ఉంచడంతో అతడు ఎలాంటి పాత్రను చేస్తున్నాడు అనేది అర్థం కావడం లేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో వరుణ్ సందేశ్ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ రోల్‌ను చేయబోతున్నాడని మాత్రం తెలిసింది.
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మైఖేల్' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రముఖ దర్శఖుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే.