Don't Miss!
- Finance
Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్కి ఎలా ప్రిపేర్ చేయాలి
- News
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
- Technology
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్టాప్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Veera Simha Reddy: ప్రభుదేవాను అలా పరిచయం చేసింది మా బాలయ్య.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
నందమూరి నటసింహం తాజాగా నటించిన సినిమా వీర సింహా రెడ్డి. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. ప్రమోషన్ లో భాగంగా వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీర సింహా రెడ్డి సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ ఆవిష్కరించారు. అనంతరం బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారీగా అంచనాలు..
నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వీర సింహా రెడ్డి. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా బ్యూటిఫుల్ శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ మరో కీలక పాత్రల్లో అలరించనున్నారు.

గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రం బృందం జనవరి 6న అంటే ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వీర సింహా రెడ్డి ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ బాలయ్య బాబుపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ గారి సినిమాలే చూసేవాళ్లం..
"ఒంగోలు అంటే ఎంతో ఇష్టం.. ఇక్కడే చదువుకున్నాను.. ఇక్కడే తిరిగాను. మాది ఒంగోలు దగ్గర చిన్న ఇడమానూర్. అప్పుడు మా నాన్నగారు ఐదు రూపాయలు ఇచ్చేవారు. అందరం సైకిళ్లు వేసుకుని ఒంగోలు వచ్చి మూడు సినిమాలు చూసేవాళ్లం. అన్ని ది గ్రేట్ ఎన్టీ రామారావు (సీనియర్ ఎన్టీఆర్) గారి సినిమాలే చూసేవాళ్లం. నేల టికెట్లు కొనుక్కొని చూసేవాళ్లం. నేను ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ ని" అని బి గోపాల్ తెలిపారు.

నేను అప్పుడే కావాలని అడిగా..
"బాలయ్య బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక అద్భుతమైన నటుడు. నాకు నాలుగు సూపర్ హిట్ సినిమాలు చేసి పెట్టాడు బాలయ్య. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు అన్ని సూపర్ హిట్స్ సినిమాలే. బాలయ్య బాబు అన్న ఆ పేరు అన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లిన జై బాలయ్య అంటున్నారు. నేను లారీ డ్రైవర్ సినిమాలో అప్పుడే ట్యూన్ కి బాలయ్య.. బాలయ్య అని పేరు కావాలి అని అడిగాను. జొన్నవిత్తుల గారు బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అని రాశారు" అని డైరెక్టర్ బి గోపాల్ పేర్కొన్నారు.

ప్రభుదేవాను డ్యాన్స్ మాస్టార్ గా..
"లారీ డ్రైవర్ సూపర్ హిట్ సినిమా. బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్యా జో కొట్టాలయ్యా అనే పాటకు డ్యాన్స్ మాస్టార్ రాజు సుందరం గారు. ప్రభుదేవా మాస్టార్ అసిస్టెంట్. ప్రభుదేవా కంపోజ్ చేస్తాడు.. అతన్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి.. బాలయ్య బాబుకి చెప్పవా అని రాజు సుందరం అంటే నేను వెళ్లి మెల్లిగా చెప్పా. వెంటనే ఓకే అన్నారు. ప్రభుదేవాను ఫస్ట్ డ్యాన్స్ మాస్టార్ ని చేసింది మా బాలయ్య బాబు. హాట్సాఫ్ బాబు. అది మా బాలయ్య బాబు మంచితనం" అని బి గోపాల్ వెల్లడించారు.