For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Veera Simha Reddy: ఆ సినిమాకు వెళ్తే గొడవ అయింది, జైల్లో వేశారు.. గోపిచంద్ షాకింగ్ కామెంట్స్

  |

  సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను బాలయ్య బాబు అని ముద్గుగా పిలిచుకుంటారు. అంతేకాకుండా బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సినిమాపై అంచనాలే కాకుండా అభిమానుల్లో బీభత్సమైన క్యూరియాసిటీ నెలకొంటుంది. ఈ ఆసక్తి ఇప్పుడు కాదు.. బాలకృష్ణ అభిమానులకు ఎప్పటినుంచో ఉంది. అయితే ఇందుకు ఉదాహరణే తాజాగా వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపిచంద్ మలినేని షేర్ చేసుకున్న ఒక సంఘటన. ఇంతకీ అదేంటనే వివరాల్లోకి వెళితే..

  మాస్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నా..

  మాస్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నా..

  మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు, పాటలు తెగ వైరల్ అయ్యాయి.

  సంక్రాంతి కానుకగా..

  సంక్రాంతి కానుకగా..

  ఇక వీర సింహారెడ్డి టైటిల్ పోస్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ గెటప్, టీజర్, సుగుణ సుందరి, జై బాలయ్య, మా బావ మనోభావాలు పాటలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రం బృందం జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

  అది 1999వ సంవత్సరం..

  అది 1999వ సంవత్సరం..

  వీర సింహా రెడ్డి ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని షాకింగ్ కామెంట్స్ చేశారు. "సరిగ్గా అది 1999వ సంవత్సరం. ఒంగోలులో సమర సింహా రెడ్డి సినిమా చూడాలని.. పక్కనే 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న బదులూరివారిపాలెం నుంచి ఒక 20 మంది మిత్రుల తోటి సైకిళ్ల మీద సమర సింహా రెడ్డి సినిమాకు వచ్చాం. ఆ 20 మంది కూడా ఇక్కడే ఉన్నారు" అని గోపిచంద్ మలినేని తెలిపాడు.

   నైట్ షో చూశాకే ప్రశాంతత..

  నైట్ షో చూశాకే ప్రశాంతత..

  "ఈరోజు ఇంత వేల మందిలో బాలయ్య బాబు ఫ్యాన్స్ మీరు ఎలా ఉన్నారో.. ఆరోజు.. నేను కూడా బాలయ్య బాబు ఫ్యానులా సమర సింహా రెడ్డి సినిమాకు వెళ్లా. సమర సింహా రెడ్డి సినిమాకు వెళితే అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. తీసుకెల్లి లోపల (జైలులో) వేశారు. రెండు పీకారు. ఆరోజు సినిమా మిస్ అయిపోయాము. మార్నింగ్ 11 గంటలకు సేమ్ ఇలాగే సంక్రాంతికే 99లో రిలీజ్ అయింది. అలా మిస్సయి పోయాను అని బాధపడ్డా. ఆరోజు మా ఫ్రెండ్స్ అంతా చాలా ఇది అయిపోయాం. మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత నైట్ షో చూసి ఇంటికి వెళ్లి పడుకున్న తర్వాతే ప్రశాంతంగా ఉన్నా" అని గోపిచంద్ మలినేని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

  నాకు బ్యాక్ బోన్ లా ఉన్నారు..

  నాకు బ్యాక్ బోన్ లా ఉన్నారు..

  "బాలయ్య బాబుతో నేను సినిమా చేస్తున్నానంటే ఫస్ట్ మా మైత్రీ మూవీ మేకర్స్.. నవీన్ గారు, రవి గారు ఇచ్చిన సపోర్ట్ మాములు సపోర్ట్ కాదు. నేను ఎంత ఇష్టపడతానో బాలయ్య బాబును వాళ్లు కూడా అంతే ఇష్టపడతారు. ఈ సినిమాకు నాకు ఏం కావాలో మొత్తం సమకూర్చారు. నా వెనుక నిలబడ్డారు. ఈ సినిమాకు నాకు ఒక గోడల, బ్యాక్ బోన్ లో నా వెనుక నిల్చున్నారు నా టెక్నిషీయన్స్" అని పేర్కొన్నాడు గోపిచంద్ మలినేని.

  English summary
  Gopichand Reveals He Went Jail After Fight At Samara Simha Reddy Theater In Nandamuri Balakrishna Veera Simha Reddy Pre Release Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X