Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhanush వరుసగా రెండో తెలుగు సినిమా.. వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్.. నిర్మాత ఎవరంటే!
సెకండ్ లాక్‌డౌన్ తర్వాత విలక్షణ నటుడు ధనుష్ మంచి జోరు మీద ఉన్నారు. తాజాగా జగమే తంత్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రశంసలు అందుకొన్న ధనుష్ ఇప్పుడు టాలీవుడ్‌లో నేరుగా తన సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు కేవలం తమిళ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో దర్శకుడు కార్తీక్ నారాయణ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా పలువురు తెలుగు దర్శక, నిర్మాతలతో సమావేశమై పలు కథలపై చర్చలు జరిపారనేది తాజా సమాచారం.
ఈ క్రమంలోనే కొద్ది రోజల క్రితం దర్శకుడు శేఖర్ కమ్ములతో ప్యాన్ ఇండియా సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. అంతేకాకుండా అదే ఊపులో మరో తెలుగు సినిమా దర్శకుడు వెంకీ అట్లూరికి కూడా ఓ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీ వర్గాలు స్పష్టం చేశాయి. వెంకీ అట్లూరి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారని, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు.

ధనుష్ ఓకే చెప్పడంతో ప్రస్తుతం వెంకీ అట్లూరి స్క్రిప్టు వర్క్‌లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు అని వెల్లడించారు. ఇక వెంకీ అట్లూరి విషయానికి వస్తే ఇటీవల నితిన్, కీర్తీ సురేష్‌తో రూపొందించిన రంగ్ దే మంచి విజయాన్ని అందుకొన్నది.
ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ నిర్మాత నాగవంశీ ఇటీవలే జెర్సీ చిత్రానికి జాతీయ అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో అయప్పనుమ్ కోషియమ్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.