Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వేణు మాధవ్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రునయాల మధ్య అంత్యక్రియలు
నవ్వుల రారాజు వేణు మాధవ్‌కు సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. భారీగా తరలి వచ్చిన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిసాయి. ఆయన అంత్యక్రియలు మౌలాలి హౌసింగ్ బోర్డు శ్మశాన వాటికలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు వేణు దహన సంస్కరాలు నిర్వహించారు.
గురువారం వేణు మాధవ్ ఇంటి నుంచి భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తరలించగా.. అక్కడ సినీ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు ఫిలింఛాంబర్ మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, మురళీ మోహన్, రాజీవ్ కనకాల, నాగబాబు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జీవితా రాజశేఖర్, ఉదయభాను తదితరులు శ్రద్దాంజలి ఘటించారు.

అనంతరం ప్రారంభమైన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణు మాధవ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విషాదంలో మునిగిపోయారు.
గత కొద్దికాలంగా కాలేయ, కిడ్ని సమస్యతో బాధపడతున్న ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ, ప్రేక్షకలోకం విషాదంలో మునిగిపోయింది.