డియర్ కామ్రేడ్ సినిమాతో మరో రికార్డు అందుకున్న విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేసే అతికొద్ది మంది హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ అందరికంటే విబిన్నంగా ఉంటుంది. దానికి తోడు రౌడీ స్టార్ తన డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో కూడా సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తుంటాడు. ఇక ఇటీవల మరొక సినిమాతో యూ ట్యూబ్ లో విజయ్ సరికొత్త రికార్డును అందుకున్నాడు.
విజయ్ దేవరకొండ ఎంతో ఇష్టపడి చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. గీతాగోవిందం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం రష్మీక మందన్నతో మరోసారి కలిసి నటించిన సినిమా కావడంతో అప్పట్లో బాగానే హైప్ క్రియేట్ అయ్యింది. 2018లో వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యింది. సినిమా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుకుంది.

ఇక హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేయగా ఊహించని రేంజ్ లో వ్యూవ్స్ అందుకుంది. ఇటీవల 250 మిలియన్ల వ్యూవ్స్ ను అందుకుంది. విజయ్ దేవరకొండ ప్లాప్ సినిమాలకు కూడా వందల సంఖ్యలో మిలియన్ల వ్యూవ్స్ వస్తుండడం విశేషం. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా విజయ్ తన టాలెంట్ తోనే జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక లైగర్ సినిమాతో ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేయబోతున్న విజయ్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











