విలన్‌గా నటించడం లేదు.. పుష్పపై క్లారిటీ ఇచ్చిన విక్రమ్
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ నటిస్తున్నారనే వార్త దక్షిణాది మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. డేట్స్ సమస్య కారణంగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకొన్నారని, ఆయన స్థానంలో విక్రమ్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారనే విషయం వైరల్ అయింది.
అయితే పుష్ప చిత్రంలో విక్రమ్ నటిస్తున్నారనే వార్తలో వాస్తవం లేదు. అందంతా ఊహాగానాలే. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడం లేదు అంటూ విక్రమ్ సన్నిహితులు వెల్లడించారు.

కరోనావైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్‌ను నవంబర్ 12వ తేదీన ప్రారంభించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న షూటింగులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లి అడవిలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముట్టమ్‌శెట్టి మీడియా నిర్మిస్తున్నది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2021 ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











