For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విన‌రా సోద‌రా వీర‌కుమార ఫీల్‌గుడ్ మూవీ అవుతుంది.. ట్రైలర్ రిలీజ్ వేడుకలో

  |

  ల‌క్ష్మీస్ సినీ విజ‌న్స్ బ్యాన‌ర్ పై ల‌క్ష్మ‌ణ్ క్యాదారి నిర్మాణంలో స‌తీష్‌చంద్ర నాదెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం విన‌రా సోద‌రా వీర‌కుమార‌. శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని మంగ‌ళ‌వారం ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో చిత్ర ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ చేతుల మీద‌గా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో...

  బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ... ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ ట్రైల‌ర్ లాంచ్ అయిన సంద‌ర్భంగా ముందుగా కృత‌జ్ఞ‌త‌లు.నేను ఒక నెల క్రితమే ఈ ట్రైల‌ర్‌ను చూశాను. చాలా బావుంది ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. నాకు స‌తీష్‌ని ల‌క్ష్మ‌ణ్ ప‌రిచ‌యం చేశాడు. స‌తీష్ క‌థ చెప్ప‌డంతో విమ‌ర్శ‌కుల‌తో కూడా ప్ర‌శంస‌లు అందుకునే క‌థ ఇది అని అన్నాను. ప్ర‌స్తుతం ఉన్న చిత్రాల‌తో పోటీ ప‌డే క‌థ త‌ప్ప‌కుండా చెయ్య‌మ‌న్నాను. ఈ చిత్ర షూటింగ్ మొత్తం కాకినాడ‌లో జ‌రిగింది. యూనిట్ మొత్తం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఎన్నో ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది. డిఫ‌రెంట్ స్టోరీ ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు. ఈ ట్రైల‌ర్ యూత్‌లో మంచి ట్రెండింగ్ కావాల‌ని కోరుకుంటున్నాను.

  ల‌క్ష్మీభూప‌తి మాట్లాడుతూ... ఇన్నాళ్లు ఎన్నో క‌థ‌లు విన్నాను, మొట్ట మొద‌టిసారి బాగా నాకు న‌చ్చిన క‌థ ఇది. అద్భుత‌మైన తెలుగు ప్రొడ్యూస‌ర్‌, తెలుగు మ‌నుషులు చేశారు. నాకు అది న‌చ్చి క‌థ‌కి ఇన్స్పైర్ అయ్యి ఈ చిత్రాన్నిచేశాను. ఉత్తేజ్ అన్న‌య్య కొన్ని కొన్ని ఎమోష‌న్స్‌ని చాలా బాగా పండించారు. హీరో కూడా చాలా బాగా చేశారు. ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ నా కృతజ్ఞ‌త‌లు ప్రొడ్యూస‌ర్‌కి మంచిగా డబ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

  Vinara Sodara Veera Kumara Movie trailer release function

  హీరోయిన్ ప్రియాంక జైన్ మాట్లాడుతూ... ముందుగా నేను తెలుగు ఇండ‌స్ట్రీకి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ఈ సినిమా టైటిల్ విన‌డానికి చాలా పాత‌కాలం లాగా ఉంటుంది. కాని చాలా మోడ్ర‌న్ స్టోరీ ఇది. స‌తీష్‌గారి స‌పోర్ట్ వ‌ల్ల నేను అంత బాగా చెయ్య‌గ‌లిగాను. ఈ చిత్రానికి క‌థే మెయిన్ బ్యాక్‌బోన్ అని అన్నారు.

  ప్రొడ్యూస‌ర్ లక్ష్మణ్ మాట్లాడ‌ుతూ... మా సినిమాని అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

  డి.ఓ.పి మాట్లాడుతూ... నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కి కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

  డైరెక్ట‌ర్ స‌తీష్ మాట్లాడుతూ... ఇది చాలా జెన్యూన్ గా రాసిన క‌థ‌. డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఎన్నో సంవ‌త్స‌రాలుగా ట్రై చేస్తున్నాను. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ల‌క్ష్మ‌ణ్‌గారికి నా కృతజ్ఞ‌త‌లు. కొత్త కాన్సెప్ట్‌తో రావాల‌ని క‌థ‌మీద సంవ‌త్స‌రం పాటు ప‌ని చేశాను. అంద‌ర్నీ కొత్త‌వాళ్ళ‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ చిత్రం షూటింగ్ మొత్తం కాకినాడ‌లో సింగిల్ షెడ్యూల్‌లో 50రోజుల పాటు చేశాము. అంద‌రూ చాలా బాగా కోప‌రేట్ చేశారు. ల‌క్ష్మ‌ణ్‌గారు ఇప్ప‌టికే మూడు సినిమాలు తీశారు. మూడు సినిమాల్లో ముగ్గురు కొత్త డైరెక్ట‌ర్లే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు.

  చైల్డ్ ఆర్టిస్ట్ రోష‌న్ మాట్లాడుతూ... న‌న్ను న‌మ్మినాకు ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు అంద‌రికీ పేరు పేరునా నా కృత‌జ్ఞ‌త‌లు. ఆల్ ద బెస్ట్ అన్నారు.

  న‌టీన‌టులుః

  శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాక‌జైన్‌, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌, జైబోలో చంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః ల‌క్ష్మీభూపాల‌, సంగీతంః శ్ర‌వ‌ణ్‌భ‌ర‌ద్వాజ్‌, కెమెరాఃర‌వి.వి, డాన్స్ః అజ‌య్‌సాయి, స్టంట్స్ః రాబిన్‌సుబ్బు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః అనిల్ మైలాపుర్ ప్రొడ్యూస‌ర్ః ల‌క్ష్మ‌ణ్‌ క్యాదారి, డైరెక్ట‌ర్ః స‌తీష్ చంద్ర‌నాదెళ్ళ‌.

  English summary
  Vinara Sodara Veera Kumara Movie's trailer released in Hyderabad on 26th. This movie directed by Satish Chandra Nadella, Produced by Lakshman K. Srinivasulu, Priyanka Jain are the lead pair. In this event, Producers Bekkam Venu, Laxman spoke to media about the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X