For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vishal Marriage: అభినయతో పెళ్లి.. మాటిస్తే తప్పను.. అప్పుడే ముహుర్తం.. విశాల్ క్లారిటీ

  |

  కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హీరో విశాల్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి హిట్ సాధించాయి. పందెం కోడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో విశాల్. అప్పటి నుంచి తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు.

  అయితే విశాల్ కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ పేరు తెచ్చుకున్నాడు. ఆయన పెళ్లి, ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ఇటీవల ఆర్టిస్ట్ అభినయతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు హీరో విశాల్.

  లాఠీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు..

  లాఠీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు..

  పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో విశాల్. ఆయన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తూ నిత్యం టాలీవుడ్ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్నాడు. అంతేకాకుండా సామాజిక అంశాలపై ఎక్కువగా సినిమాలు తెరకెక్కిస్తూ మిగతా భిన్నమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల అభిమన్యు, యాక్షన్, ఎన్మీ చిత్రాలతో అలరించిన విశాల్ ఇప్పుడు లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  పాన్ ఇండియాగా..

  పాన్ ఇండియాగా..

  విశాల్ హీరోగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ పై రాబోతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇందలో విశాల్ కు జోడిగా సునయన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 22న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియాగా విడుదల చేయనున్నారు.

  విశాల్ పెళ్లి, ప్రేమాయణంపై పుకార్లు..

  విశాల్ పెళ్లి, ప్రేమాయణంపై పుకార్లు..

  విశాల్ లాఠీ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విశాల్. అయితే ఇటీవల హీరో విశాల్ పెళ్లి, ప్రేమాయణంపై పుకార్లు రావడం వింటూనే ఉన్నాం. మొదట్లో విశాల్.. వరలక్ష్మీ శరత్ కుమార్ తో లవ్ లో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అనీషా రెడ్డిని ప్రేమిస్తున్నాడని తెలిసింది.

  ప్రతి విషయానికి టైమ్ వస్తుంది..

  ప్రతి విషయానికి టైమ్ వస్తుంది..

  అంతేకాకుండా ఆమెతో నిశ్చితార్థం అయింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారి పెళ్లి రద్దు అయింది. ఇక ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయను హీరో విశాల్ లవ్ చేస్తున్నాడనే రూమర్ చక్కర్లు కొట్టింది. ఈ విషయంపైన లాఠీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో విశాల్ ను అడిగింది. అభిమానుల కోసం అభినయ గురించి చెప్పండని యాంకర్ అడగ్గా.. "ప్రతి విషయానికి టైమ్ వస్తుంది నేను మాట ఇస్తే తప్పను. ఆ మాట పూర్తయ్యే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.

  ఇప్పటికీ అలానే ఉన్నారు..

  ఇప్పటికీ అలానే ఉన్నారు..

  ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ముహుర్తంలో నా పెళ్లి జరుగుతుంది. 3500 కుటుంబాలు, ఆ థియేటర్ ఆర్టిస్ట్ లు ఇంకా 30 సంవత్సరాల ముందు ఆ మేకప్, చిరిగిపోయిన డ్రెస్ వేసుకుని ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇప్పటికీ నాటకాలు, డ్రామాలు వేస్తున్నారు. వాళ్లు బాగుండాలనే కోరికతో మా టీమ్ ప్రయత్నిస్తోంది.

  అమ్మాయి ఎవరో చెప్పలేదు..

  అమ్మాయి ఎవరో చెప్పలేదు..

  ఆ బిల్డింగ్ కట్టించి పెన్షన్, మెడికల్ సౌకర్యం ఇలా వారి జీవితంలో కాస్తా మార్పు జరిగితే చాలు. ఆ బిల్డింగ్ పూర్తయ్యాకా నేను అందరినీ పిలుస్తాను. పెళ్లికి కూడా పిలుస్తాను. మీరందరు వస్తారు" అని విశాల్ చెప్పుకొచ్చాడు. అయితే అభినయ పేరు చెప్పకుండా తన పెళ్లి గురించి ఇలా క్లారిటి ఇచ్చాడు విశాల్. అమ్మాయి ఎవరో రివీల్ చేయలేదు. ఇక అభినయ విషయానికొస్తే ఆమె శంభో శివ శంభో సినిమాలో రవితేజకు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేశ్ బాబుకు చెల్లెలిగా నటించింది. అలాగే డమరుకం సినిమాలో కూడా యాక్ట్ చేసింది.

  English summary
  Kollywood Hero Vishal Interesting Comments On His Marriage With Abhinaya And Nadigar Building In Lathi Movie Teaser Launch Event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X