For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అవార్డుల ఫంక్షన్‌కు వస్తే వెనక్కి పంపించారు.. ఇప్పుడు గౌరవంగా ఇచ్చారు.. విశ్వక్ సేన్

  |

  'ఆర్‌ఎక్స్‌ 100'లో నటనకు గాను బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవార్డు అందుకున్న రాంకీ మాట్లాడుతూ ''ఒక చక్కని పాత్రతో తెలుగులో ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్రసీమకు చెందిన ఇంతమంది గొప్పవాళ్ల సమక్షంలో 'సంతోషం' అవార్డును అందుకోవడం ఎప్పటికీ మరచిపోలేను'' అన్నారు.

  అంబికా కృష్ణ చేతుల మీదుగా ఆత్మీయ పురస్కారం అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీ రాజ్‌ మాట్లాడుతూ.. అవార్డు వేడుక ఒక సంవత్సరం చేయాలంటేనే చాలా కష్టం, అలాంటిది 17 సంవత్సరాలు చేశారంటే.. కష్టానికి ప్రతిరూపం ఎవరంటే సురేష్‌. ఆయన కష్టానికి ఇష్టుడు. అందరూ ప్రేమించే వ్యక్తి. అందుకే మెగాస్టార్‌ ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. నేను సురేష్‌ కోసమే ఇక్కడకు వచ్చాను. ఆయన మరో వందేళ్లు అలాగే సంతోషంగా ఉండాలి'' అన్నారు.

  Vishwak Sen about Santosham South Indian Film Awards

  'రంగస్థం' చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడి అవార్డును సుకుమార్‌ బదులు ఆయన సతీమణి తబిత అందుకున్నారు. నిర్మాతలు సురేశ్‌బాబు, దిల్‌ రాజు ఈ అవార్డును అందజేశారు.

  శ్రియ చేతుల మీదుగా బెస్ట్‌ డెబ్యూ హీరో అవార్డు అందుకున్న 'ఫలక్‌నుమా దాస్‌' హీరో విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ.. ''10 ఏళ్ల క్రితం నా ఫ్యామిలీతో సంతోషం అవార్డుకు వచ్చా. హాల్‌ నిండిపోయిందని పంపించేశారు. ఇప్పుడు అదే ఈవెంట్‌లో అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. నాకు అవార్డు ఇచ్చినందుకు శ్రియకు థ్యాంక్స్‌. మా డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌కు ఈ అవార్డు అంకితమిస్తున్నా'' అన్నారు.

  Vishwak Sen about Santosham South Indian Film Awards

  'ఆర్‌ ఎక్స్‌ 100' మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డును శ్రియ, జయం రవి చేతుల మీదుగా హీరో కార్తికేయ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ''ఇది నా ఫస్ట్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు. ఒక అవార్డు ఫంక్షన్‌కు రావడం ఇదే తొలిసారి. నేను తెలుగులో జయం రవిగారిలా ఉండాని అనుకుంటున్నా. ఈ అవార్డు తీసుకునేంత అర్హత ఉందో లేదో నాకు తెలీదు. ఈ అవార్డును శ్రియ, జయం రవిగారి చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. నాకు మంచి బ్రేక్‌ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని చెప్పారు.

  'అరవింద సమేత'లో నటనకు గాను బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవార్డును రాజశేఖర్‌, కార్తికేయ, జీవిత చేతుల మీదుగా తమన్‌ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ''అరవింద సమేత నాకు చాలా స్పెషల్‌.. ఇది నా 100 సినిమా. ఈ అవార్డును తారక్‌, త్రివిక్రమ్‌లకు అంకితం ఇస్తున్నా. సీతారామ శాస్త్రి గారి వంటి లెజెండరీ రైటర్‌ మనకు ఉండడం మన అదృష్టం. నేను ఆయనను పెదనాన్న అని పిసుస్తుంటా. ఈ వేడుకను ఎంత కష్టమైనా ఎంత ఇష్టంగా సురేశ్‌ చేస్తుంటారో నాకు తెలుసు'' అని చెప్పారు.

  Vishwak Sen about Santosham South Indian Film Awards

  తమిళంలో 'అడంగమరు' చిత్రంలో నటనకు గాను బెస్ట్‌ యాక్టర్‌గా సురేష్‌ బాబు, దిల్‌ రాజు చేతుల మీదుగా అవార్డు అందుకున్న జయం రవి మాట్లాడుతూ ''ఈ అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. లెజెండ్స్‌ ముందు ఈ అవార్డు తీసుకుంటున్నా. సురేష్‌ గారికి చాలా థ్యాంక్స్‌. 'అడంగమరు' నాకు చాలా బాగా నచ్చిన సినిమా. ఎడిటర్‌ మోహన్‌గారు మానాన్న గారు. చాలా హిట్‌ సినిమాలకు పని చేశారు. నేను ఈ ఇండస్ట్రీలో సిన్సియర్‌గా ఉంటున్నానంటే.. ఆ గుణం ఆయన నుంచే వచ్చిందే'' అన్నారు.

  తమిళంలో మోస్ట్‌ వెర్సటైల్‌ లెజండరీ యాక్ట్రెస్‌ అవార్డును జమున చేతుల మీదుగా అందుకున్న కుట్టి పద్మిని మాట్లాడుతూ ''చెన్నైలో వున్న నన్ను పిలిచి అవార్డు ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీ అంటే మాకు చిరంజీవిగారే. మా పిల్లలకు మహేష్‌, ప్రభాస్‌ అంటే పిచ్చి. చిన్నప్పుడు మహేష్‌ వాళ్లుండే వీధిలోనే మేం వుండేవాళ్ళం'' అని గుర్తు చేసుకున్నారు.

  Vishwak Sen about Santosham South Indian Film Awards

  'పందెంకోడి 2', 'సర్కార్‌' చిత్రాల్లో నటనకు గాను బెస్ట్‌ విలన్‌ (తమిళం)గా అవార్డు అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ''పందెంకోడి 2 దర్శకుడు లింగుస్వామి, 'సర్కార్‌' దర్శకుడు మురుగదాస్‌కు ధన్యవాదాలు.. మీ ప్రేమకు థాంక్స్‌. తెలుగులో మరిన్ని సినిమాలతో రావాలని ట్రై చేస్తున్నా'' అన్నారు.

  ఇంకా అవార్డులు అందుకున్నవారిలో తెలుగులో 'రంగలస్థలం'లో 'రంగమ్మా.. మంగమ్మా' పాటకుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్‌ రక్షిత్‌, కన్నడంలో ఉత్తమ నటుడిగా ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌గా మాళవిక, బెస్ట్‌ డైరెక్టర్‌గా సంతోష్‌, తమిళంలో బెస్ట్‌ కమెడియన్‌గా సతీశ్‌ తదితరులు ఉన్నారు. అలాగే తెలుగులో 'మహానటి'గా అద్భుతంగా అభినయించిన కీర్తి సురేశ్‌కు ఉత్తమ నటిగా, అదే చిత్రంలో 'మూగమనసులు..' పాటను గొప్పగా రాసిన సిరివెన్నె సీతారామశాస్త్రికి ఉత్తమ గేయరచయిత పురస్కారాలు ప్రకటించారు.

  ఉదయభాను, సమీర్‌, తనీష్‌, తేజస్విని మదివాడ యాంకర్లుగా వ్యవహరించిన ఈ వేడుకలో కామెడీ హీరో సంపూర్ణేష్‌బాబు, హీరోయిన్లు నభా నటేష్‌, అవికా గోర్‌, నటాషా దోషి, తేజస్విని, దీప్తి సునయన చేసిన డాన్స్‌ పర్ఫార్మెన్సులు, సింగర్స్‌ రఘురామ్‌, శ్రుతి, గాయత్రి ఆలపించిన పాటలు, ఉప్పల్‌ బాలు పర్ఫార్మెన్స్‌ ఆహూతుల్ని అమితంగా అలరించాయి.

  English summary
  Santhosham South Indian Film Awards held on September 29th in Hyderabad. In this function, Vishwak Sen made funny comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X