Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
వారి ఎంట్రీతో సీన్ మారింది.. పూజాహెగ్డేకు పెరుగుతున్న మద్దతు
పూజాహెగ్డే ఇన్స్టా అకౌంట్ ఏ నిమిషాన్న హ్యాక్ కు గురైందో కానీ, కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందాన్న నెటిజన్లకు ట్రాలింగ్ చేసుకోవడానికి బోలెడంత సరుకు దొరికింది. ఇక ఇన్నళ్లూ ఎవరిని ట్రాలింగ్ చేయాలా అని ఎదురుచూస్తున్న వారికి పెద్ద డొంకే దొరికేసింది. ఓవైపు సమంతను మరింతగా ట్రాల్ చేస్తూ,#వీ సపోర్ట్ పూజాహెగ్డే అని కొత్త క్యాంపెయిన్ కు కూడా పురుడుపోసేశారు.

హర్ట్ అయిన సమంత ఫ్యాన్స్
పూజా ఇన్స్టా అకౌంట్ నుంచి సమంత ఏమంత అందంగా లేదు అన్న పోస్ట్ ఒక్కటి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రారంభమైన హడావిడి, రెండో రోజుకు మరింత పెరిగింది. పూజా హెగ్డే, తన ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయిందని ప్రకటించినప్పటికీ సమంత ఫ్యాన్స్ ఊరుకోవడంలేదు. పూజా సారీ చెప్పాల్సిందే అంటూ ట్వీట్ల వరద కురిపిస్తున్నారు. అయితే దీనికి ధీటుగా పూజా ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తునే హడావిడి ప్రారంభించారు.

మేం తక్కువేం కాదంటోన్న పూజా అభిమానులు
పూజా తరఫున వకాల్తా పుచ్చుకున్న అభిమానులు మరేం ఫర్వాలేదు నీకు అండగా మేము ఉన్నాము పూజా అంటూ అమ్మాయికి సందేశాల వరద పంపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఓ సరికొత్త సోషల్ మీడియా క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టేశారు. #వి సపోర్ట్ పూజా హెగ్డే అంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ ఊదరగొట్టేస్తున్నారు.

నా అకౌంట్ నా చేతుల్లోనే ఉందన్న పూజ
ఈ వివాదంపై స్పందించిన పూజా ఇన్ట్సాగ్రామ్ బృందం తన అకౌంట్ సేఫ్టీ గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, తన అకౌంట్ తిరిగి తన ఆధీనంలోకి వచ్చిందని స్పష్టం చేసింది.

లీకైన హీరోయిన్ క్రేజీ చాటింగ్
మరోవైపు, పూజా పోస్ట్ పై సమంత, డైరెక్టర్ నందినీ రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద నడుమ సాగిన చాటింగ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. సమంతను టీజ్ చేస్తూ నందనీ రెడ్డి, చిన్మయి సాగించిన చాటింగ్ ను కూడా జనాలు విడిచిపెట్టలేదు.
Recommended Video

ఇప్పుడు చిన్మయి వంతు
ఇక సమంతను సమర్ధిస్తూ చిన్మయి చేసిన ట్వీట్ పైనా బురద జల్లేందుకు నెటిజన్లు వెనుకాడటంలేదు. సామ్ అద్భుతమైన మనిషి అంటూ చిన్మయి ట్వీట్ చేయగా, దానికి వ్యతిరేకంగా ప్రత్యుత్తరాలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాష్ టాగ్ చీప్ సమంతా మాఫియా అన్న క్యాంపెయిన్ కూడా మొదలైంది. ఏమైనా, కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అంటే ఇదే కాబోలు.