OG మూవీకి అకీరాను దూరంగా పెట్టిన సుజిత్.. ఎందుకో తెలుసా?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ ఓజీ అన్న పేరే వినిపిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్.. రికార్డుల్ని దుమ్ముదులుపుతోంది. ఇప్పటి వరకు పవన్ కెరీర్‌లో లేని విధంగా కలెక్షన్స్ కుమ్మేస్తోంది. తన స్టైలీష్ టేకింగ్‌తో పవన్ అభిమానులకు విందు భోజనం అందించాడు సుజీత్. గడిచిన ఐదు రోజులుగా పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ చిత్రాన్ని నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహించారు.

మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలు
చిత్ర పరిశ్రలోని అందరు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులంతా తమ వారసులను ఆల్రెడీ ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. వీరిలో కొందరు స్టార్లుగా నిలదొక్కుకోగా.. మరికొందరు ఇదే దారిలో ఉన్నారు. త్వరంలోనే మరికొందరు స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో లాంచ్ కానున్నారు. మెగా ఫ్యామిలీ నుంచే తీసుకుంటే చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్‌లు తమ వారసులుగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్‌లను వెండితెరకు పరిచయం చేశారు. వీరే కాకుండా ఈ కుటుంబం నుంచి నిహారిక, సాయిథరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌లు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
అకీరా ఎంట్రీ ఎప్పుడు?
కానీ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా నందన్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అకీరా డెబ్యూ మూవీ ఇదేనంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీలోనూ అకీరా ఉన్నట్లు గట్టిగా పుకార్లు వచ్చాయి. కొన్ని ఫ్యాన్ పేజీలలోనూ దీనిపై డిస్కషన్స్ జరిగాయి. ఓజీలోని ఓ సాంగ్‌లో వచ్చిన చిన్న యానిమేషన్‌లో కనిపించిన యువకుడి రూపం అకీరాను పోలి ఉండటమే ఈ ఊహాగానాలకు కారణం. మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేయడానికి సుజీత్ ఇలా అకీరాతో క్యామియో ప్లాన్ చేశాడని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక ఇదంతా ఫేక్ అని తేలిపోయింది. తమను ఊరించి నిరాశపరిచారని మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే అకీరాతో ఓజీలో రోల్ చేయించలేదట
అకీరాను పోలీ ఉన్న రోల్ చేసిన జూనియర్ కళ్యాణ్ బాబును జనం నిజంగానే అకీరా అనుకున్నారు. హైట్, హెయిర్ కట్, స్టైల్ అంతా అకీరాలా కనిపించమే దీనికి కారణం. దీనిపై ఓ ఇంటర్వ్యూలో జూనియర్ కళ్యాణ్ బాబుగా చేసిన చందు స్పందించారు. మెగా ఫ్యాన్స్‌ని మోసం చేశావంటూ యాంకర్ అడగ్గా.. సినిమా డిస్కషన్ అప్పుడే ఈ టాపిక్ వచ్చిందని ఆయన చెప్పారు. దీని గురించి నేను సుజీత్‌ను అడిగానని.. అకీరాను ఈ పాత్రలో పెట్టుకుని ఉంటే ఇంకో రేంజ్‌లో ఉండేదని అన్నానని తెలిపారు. వయసు పెరిగేకొద్దీ హైట్ పెరుగుతుందని.. చిన్నప్పుడే ఓ హైట్ చూపించి, సడెన్‌గా హైట్ తగ్గినట్లుగా చూపిస్తే ఆడియన్స్ లాజిక్కులు తీస్తారని సుజీత్ చెప్పారని జూనియర్ కళ్యాణ్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అకీరాను ఓజీకి ఎందుకు దూరం పెట్టారో మెగా అభిమానులకు ఓ క్లారిటీ వచ్చినట్లుగా అయ్యింది.


Click it and Unblock the Notifications











