Don't Miss!
- News
అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం KCR
- Sports
Australia Open 2023 ఫైనల్లో సానియా జోడీ!
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో మరింత రొమాంటిక్‌గా ఎలా ఉండాలో తెలుసా?
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
సినీ పరిశ్రమలో మరో విషాదం: బాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు డైరెక్టర్ కన్నుమూత
కొంత కాలంగా సినీ రంగంలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయిన సంగతి విధితమే. రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రభావంతో మరికొంత మంది కూడా చనిపోయారు. దీంతో రెండేళ్లుగా సినీ పరిశ్రమలో సినీ నటులు, టెక్నీషియన్లు ఇతర ప్రముఖుల మరణాలతో తీరని శోకం మిగులుతోంది. వరుస సంఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పరిస్థితుల్లో తాజాగా టాలీవుడ్‌లో మరొక ప్రముఖులు ప్రాణాలు విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!
సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా విశిష్ట సేవలు అందించిన తాతానేని రామారావు (T. Rama Rao) బుధవారం తెల్లవారుజామున తుది శ్వాసను విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఎమర్జెన్సీ వైద్యాన్ని అందించారు. కానీ, రామారావు కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

తాతినేని రామారావు కృష్ణా జిల్లాలోని, కపిలేశ్వరపురంలో 1938వ సంవత్సరంలో జన్మించారు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆయన 1950 నుంచి తన బంధువులైన దర్శకుడు టీ ప్రకాష్ రావు, కోటయ్య ప్రత్యగాత్మల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత అంటే 1966లో టీ రామారావు 'నవరాత్రి' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇది తమిళంలో శివాజీ గణేషన్, సావిత్రిలు జంటగా నటించిన 'నవరాత్రి' అనే సినిమాకు రీమేక్‌గా రూపొందింది. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కలిసి నటించారు. మొదటి సినిమానే అయినా అదిరిపోయే డైరెక్షన్‌తో రామారావు అందరి దృష్టినీ ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు.
Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!
టీ రామారావు ఆ తర్వాత ఎన్నార్, జయలలితలతో కలిసి 'బ్రహ్మచారి' అనే చిత్రాన్ని రూపొందించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అనంతరం 'మంచి మిత్రులు', 'రైతు కుటుంబం', 'జీవన తరంగాలు', 'యమగోల', 'శ్రీరామ రక్ష' ఇలా వరుసగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీ రామారావు 1979లో 'లోక్ పర్లోక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా దర్శకుడిగా అడుగు పెట్టారు. ఇది ఎన్టీఆర్ నటించిన 'యమగోల' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో జితేంద్ర, జయప్రద నటించారు. ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ సక్సెస్ సాధించడంతో 1980 నుంచి వరుసగా హిందీ సినిమాలే రూపొందించారు.
తన సినీ ప్రయాణంలో టీ రామారావు గొప్ప గొప్ప నటులతో సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వర్రావుతో నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతుకుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష సినిమాలు తీశారు. అలాగే, ఎన్టీఆర్‌తో యమగోల, ఆటగాడు, అనురాగదేవత.. శోభన బాబుతో జీవనతరంగాలు, ఇల్లాలు.. బాలకృష్ణతో ప్రెసిడెంట్ గారి అబ్బాయి, తల్లిదండ్రులు వంటి మూవీలు రూపొందించారు. అలాగే, అమితాబ్ బచ్చన్ తో అంధా కానూన్, ఇంక్విలాబ్ వంటి సినిమాలు చేశారు. వీళ్లతో పాటు జీతేంద్ర, మిథున్ చక్రవర్తి సహా ఎంతో మంది స్టార్లతో తాతినేని రామారావు సినిమాలు తీసి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు.