నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరోసారి వరుస అపజయలతో సక్సెస్ ట్రాక్ ను మిస్సవుతున్న విషయం తెలిసిందే. అయితే సక్సెస్ ఉన్నా లేకున్నా ఆయన సినిమాల బిజినెస్ పై మాత్రం పెద్దగా ఎఫెక్ట్ ఉండదని అందరికి తెలిసిన విషయమే. బాలయ్యకు ఉండాల్సిన మార్కెట్ నిరంతరం స్థిరంగానే కొనసాగుతోంది. ఇక బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా బడ్జెట్ విషయంలో కాస్త హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ సినిమా రిజల్ట్ పై మాత్రం అనుమానాలు లేవని టాక్ వస్తోంది.
ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని విధంగా డిజాస్టర్స్ అందుకున్న బాలకృష్ణ ఎలాగైనా BB3 ద్వారా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. వీలైనంత వరకు ఆ సినిమాను త్వరగా పూర్తి చేసి వెంటనే మరో సినిమాను కూడా పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఆయన ఒప్పుకుంటే వెంటనే సినిమాలను స్టార్ట్ చేయాలని ఒక కుర్ర హీరోతో పాటు యువ దర్శకుడు కూడా రెడీగా ఉన్నారు.
బాలయ్యకు ఇటీవల రెండు ఆఫర్స్ వచ్చాయి. యువ హీరో నాగ శౌర్యతో ఒక సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
కానీ ఇంకా అది ఫైనల్ కాలేదు. మరోవైపు కందిరీగ, రభస వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేయాలని భావిస్తున్న బాలయ్య ఇంకా ఆ సినిమాకు కూడా పూర్తి స్థాయిలో ఓకే చెప్పలేదట. దీంతో ఈ ఇద్దరు బాలకృష్ణ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అని ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. మరి బాలయ్య ఎప్పుడు ఓకే చెబుతాడో చూడాలి.
Boyapati Srinivas is coming up with the next Nandamuri Balakrishna movie. Since then, there has been a dose of anticipation among fans that Balakrishna will be appearing in the new gateways as never before. But even when the budget figures are down, the director is not slowing down. This is not a Baahubali movie as the budget figures are rising .. Ballaya Movie is coming up with comments.
Story first published: Sunday, December 6, 2020, 11:17 [IST]