Just In
- 18 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 2 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Finance
Gold prices today: రూ.49,000 స్థాయికి బంగారం ధరలు, వెండి స్వల్పంగా అప్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. బోయపాటి షాక్!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరో హీరోయిన్ కాంబోపై అంచనాలు పెరిగేవి. కానీ ఆ తరువాత కాలంలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ పైనే అంచనాల డోస్ అకాశాన్ని దాటేస్తున్నాయి. బిజినెస్ అయితే షూటింగ్ మొదలైన రోజే మొదలవుతుంది. అందులో మన బాలయ్య- బోయపాటి కాంబో ఒకటి. అయితే సినిమాకు సంబంధించిన ఒక టాపిక్ ఇప్పుడు అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.
మిస్ ఇండియా గ్లోబల్ ఆషిమా నర్వాల్ కిల్లింగ్ లుక్ ఫొటోలు

మూడవసారి కలవడంతో..
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కలయికలో వచ్చిన మొదటి సినిమా సింహా. ఆ మూవీ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వచ్చిన లెజెండ్ కూడా ఊహించని విదంగా రికార్డులను బ్రేక్ చేసింది. ఇక మూడవసారి కలిసి చేస్తున్న సినిమాపై అయితే ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఆలస్యం అయినా పరవలేదని..
దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే వీరు చేసిన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. అందుకే సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత ఆలస్యం అయినా పరవలేదని ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆచరణలో పెడుతున్నారు.

ఊహించని విదంగా ఉండాలని
ఇక సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు బోయపాటి గత కొంతకాలంగా యువ హీరోలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి సినిమాలో ఈ దర్శకుడు ఎదో ఒక పాత్రలో ఒకప్పుడు హీరోగా ఇన్నవారినైనా లేకపోతే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలైనా స్పెషల్ గా ప్రజెంట్ చేస్తుంటాడు. ఇక ఈ సారి ఎవరు ఊహించని విదంగా ఉండాలని టాలెంటెడ్ యాక్టర్ ను అనుకున్నారట.

పవర్ఫుల్ పాత్ర కోసం నిఖీల్..
ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం యువ హీరో నిఖీల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మొదట ఆది పినిశెట్టి, నారా రోహిత్ ను అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా నిఖీల్ కు క్యారెక్టర్ గురించి చెప్పారట. అయితే కొన్ని రోజులు టైమ్ అడిగిన ఆ యువ హీరో చివరికి ఆ పాత్రను చేయలేనని రిజెక్ట్ చేయడంతో బోయపాటి షాక్ అయ్యారట. దీంతో ఒక్కసారిగా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ పాత్ర కోసం దర్శకుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.
తమిళ కుట్టి ఐశ్వర్య మీనన్ హాట్ ఫొటోలు