Food Poision: రణ్‌వీర్ సింగ్ షూటింగ్‌లో విష ఆహారం.. 120 మందికిపైగా తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న సినిమా షూటింగ్‌లో అపశృతి చోటు చేసుకొన్నది. లేహ్ పరిసర ప్రాంతంలో జరుగుతున్న ధురంధర్ సినిమా షూటింగ్‌లో విష ఆహారం కారణంగా 120 మందికిపైగా యూనిట్ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భారీ సంఖ్యలో యూనిట్ సభ్యులు హాస్పిటల్‌లో చేరడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో షూటింగ్‌ను వాయిదా వేసి సభ్యుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు నిర్మాతలు దృష్టిపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆదిత్య ధార్ రూపొందిస్తున్న ధురంధర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం లేహ్ ప్రాంతంలో జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్‌లో సుమారుగా 600 మంది పాల్గొంటున్నారు. ఈ సినిమాకు కీలకమైన యాక్షన్ సీన్లను భారీ లెవెల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగుకు ఫుడ్ పాయిజన్ సంఘటన తీవ్ర అంతరాయం కలిగించింది.

లేహ్‌లో ఆదివారం సాయంత్రం వరకు షూటింగ్ సవ్యంగానే సాగింది. డిన్నర్ సమయంలో ఆహారం విషపూరితంగా మారడంతో 120 మంది సభ్యులు అనారోగ్యం బారిన పడ్డారు. భోజనం చేసిన తర్వాత చాలా మంది వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పితో బాధపడ్డారు. దాంతో వెంటనే స్థానికంగా ఉన్న ఎస్ఎన్ఎమ్ హాస్పిటల్‌లో బాధితులను చేర్పించారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తూ వారు త్వరగా కొలుకొనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే సంఘటనకు ప్రధాన కారణం ఏమిటనే విషయంపై నిర్మాతలు, చిత్ర యూనిట్ దృష్టిపెట్టారు. ఆహారం పదార్థాలను టెస్టింగ్ పంపించి కారణాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎక్కడ లోపం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నాం అని ఆర్గనైజర్లు వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. ఏ సభ్యుడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే సభ్యులందరూ డిశ్చార్జ్ అవుతారు అని పేర్కొన్నారు.
యూరీ, ఆర్టికల్ 370 లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ఆదిత్య ధార్ ఈ సినిమాకు దర్శకత్వంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ కాగా, బ్రహ్మండమైన రెస్సాన్స్ వచ్చింది. జీ స్టూడియో బ్యానర్‌పై బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు జ్యోతి దేశ్‌పాండే, లోకేష ధార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











