Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంచుకొండల్లో హీరోయిన్.. స్టార్ క్రికెటర్‌తో కలిసి ఎంజాయ్.. నెట్టింట వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మంచుకొండల్లో ఎంజాయ్ చేస్తోంది. అది కూడా స్టార్ క్రికెటర్‌తో కలిసి. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా వాళ్లిద్దరూ చేస్తున్న ఎంజాయ్ చూసి మురిసిపోతున్నారు సినీ, క్రీడాభిమానులు. అర్థం కాలేదా? అదేనండీ.. ఇటు సినీ లవర్స్‌కి అటు క్రికెట్ ప్రేమికులకు కిక్కిచ్చే సూపర్ జోడీ విరుష్క జంట మంచుకొండల్లో షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. వివరాల్లోకి పోతే..

మంచుకొండలపై వాలిన జంట.. న్యూ ఇయర్ స్పెషల్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. ఆయనతో సరదా సరదాగా జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పుడూ టూర్లు, షికార్లు అంటూ దేశవిదేశాలు చుట్టిరావడం.. నిత్యం వార్తల్లో నిలవడం ఈ జోడీకి అలవాటు. అలాంటిది ఇక న్యూ ఇయర్ అన్నాక ఊరుకుంటారా. ఎంచక్కా మంచుకొండలపై వాలారు.

స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్..
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్న విరుష్క జోడీ.. అక్కడ నుంచే ఓ వీడియో ద్వారా అభిమానుల్ని పలకరించి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. తొలుత విరాట్ కోహ్లీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయగా.. ఈ వెంటనే అనుష్క శర్మ అందుకుంటూ కోహ్లీని హత్తుకుని మరీ న్యూ ఇయర్ విషెస్ చెప్పింది.

డిసెంబరు ఆఖర్లో టూర్
డిసెంబరు ఆఖర్లో ఈ టూర్ వేసిన విరాట్- అనుష్క.. అక్కడే నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ, క్రీడాభిమానులు వారికి న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

సమయం దొరికిందంటే చాలు.. అదే పని
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ తమ వృత్తుల పరంగా బిజీగా ఉంటారు కాబట్టి ఏ మాత్రం సమయం దొరికినా షికారు చేస్తుంటారు. దేశవిదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లకు కూడా అనుష్క శర్మ అటెండ్ అవుతూ విరాట్ కోహ్లీకి మంచి ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంటుంది.
|
ఆ దుస్తులు వేసుకుంటే సంతోషిస్తాడు
ఇటీవలే కోహ్లీ పుట్టిన రోజు సందర్బంగా కూడా భర్తతో కలిసి భుటాన్‌కు వెళ్ళింది అనుష్క శర్మ. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. 'విరాట్ వార్డ్ రోబ్‌లో చాలా దుస్తులు ఉంటాయి. నాకు నచ్చిన వాటిని వేసుకుంటా. ఎక్కువగా టీషర్ట్స్ వేసుకోవడానికి ఇష్టపడతా. కొన్నిసార్లు కోహ్లీ జాకెట్స్ కూడా వేసుకుంటా. నేను కోహ్లీ దుస్తులు వేసుకుంటే అతను చాలా సంతోషిస్తాడు. నాక్కూడా ఇష్టమే' అని తెలిపింది.