twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగాంబో ఖుష్ హువా! 33 ఏళ్ల మిస్టర్ ఇండియా..

    |

    బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో మిస్టర్ ఇండియా ఒకటి. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా ప్రముఖ నిర్మాత బోనికపూర్ రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తెరకెక్కించారు. అమ్రిష్ పురి విలనిజం సినిమాకు మరింత ఆకర్షణగా మారింది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న చిత్రం విడుదలై సరిగ్గా 33 సంవత్సరాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అనిల్ కపూర్ ఓ వీడియోను షేర్ చేశారు.

     చెడుపై మంచి విజయం కథతో

    చెడుపై మంచి విజయం కథతో

    ఇక మిస్టర్ ఇండియా సినిమా విషయానికి వస్తే.. అనాధ పిల్లలను కోసం తాపత్రయపడే అనిల్ కపూర్‌కు విలన్ల నుంచి ముప్పు ఎదురవుతుంది. వారుండే ఇంటిని విలన్లు కబ్దా చేయడానికి పూనుకొంటారు. శ్రీదేవి ఓ జర్నలిస్టుగా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో ఓ మ్యాజిక్ గడియారం అనిల్ కపూర్ లభించడం, దానికి ఉన్న శక్తుల ద్వారా ఎవరికి కనిపించకుండా విలన్లను ఎలా ఆటకట్టించారనేది సినిమా కథ.

    విలనిజానికి అమ్రిష్ పురి కొత్త నిర్వచనం

    విలనిజానికి అమ్రిష్ పురి కొత్త నిర్వచనం

    మిస్టర్ ఇండియాలో అమ్రిష్ పురి విలనిజం బాలీవుడ్‌కు సరికొత్త అర్ధం చెప్పింది. ముగాంబో కుష్ హువా అంటూ గంభీరంగా చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలయ్యారు. ప్రత్యేకమైన శైలితో కూడిన విలనిజానికి కొత్త బాటలు వేశాడు స్వర్గియ అమ్రిష్ పురి. బాలీవుడ్‌లో ముగాంబే పాత్రను ఓ ఐకానిక్‌గా మలవడంతో అమ్రిష్ పురి తన వంతు కృషిని చేశారు.

    శ్రీదేవి గ్లామర్, చిలిపితనం

    శ్రీదేవి గ్లామర్, చిలిపితనం

    ఇక ఈ సినిమాలో శ్రీదేవి గ్లామర్, చిలిపితనం, నటన హైలెట్‌గా మారింది. శ్రేదేవీ డ్యాన్సులు, బాడీ లాంగ్వేజ్ ఆమెను అగ్రశ్రేణి హీరోయిన్‌గా మార్చేసింది. మిస్టర్ ఇండియా తర్వాత శ్రీదేవి కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్లింది. అంతేకాకుండా అనిల్ కపూర్, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.

    కిషోర్ కుమార్, లక్ష్మికాంత్ ప్యారేలాల్ గొడవ పరిష్కారం

    కిషోర్ కుమార్, లక్ష్మికాంత్ ప్యారేలాల్ గొడవ పరిష్కారం

    మిస్టర్ ఇండియా 34 ఏళ్లలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ చిత్రంలో కిషోర్ కుమార్ పాడిన జిందగీ కి యహీ రీత్ హై పాట గురించి తలచుకొన్నాడు. ఆ పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ సమయంలో కిషోర్ కుమార్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకొన్నారు. అయితే మేము జరిపిన మధ్యవర్తిత్వం కారణంగా ఈ సినిమా కోసం కలిసి పనిచేశారు.

     మిస్టర్ ఇండియాలో జీవిత సత్యం

    మిస్టర్ ఇండియాలో జీవిత సత్యం

    మిస్టర్ ఇండియా చిత్ర కథలో ఓ జీవిత సత్యం ఉంది. ఒకరితో మరొకరు కలిసి ఉండాలి. మంచి గురించి ఆలోచించాలి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా గానీ.. చివరకు మంచితనమే గెలుస్తుంది అనేది ప్రధాన అంశంగా తెరకెక్కింది. శేఖర్ కపూర్ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా.. తరగదు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కాసుల పంటకు ఆయన పూర్త క్రెడిట్ అని అనిల్ కపూర్ అన్నారు.

    English summary
    Bollywood stars Anil Kapoor, Sridevi, Amrish puri's Mr India completed 33 years. In this occassion, Anil Kapoor shared his memories in his social media pages and shared a video of the song 'Zindagi Ki Yehi Reet Hai'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X