twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పటికీ టీమిండియాకు ఆడలేవు అన్నారు: తండ్రి మాటను గుర్తు చేసుకున్న ‘83’ యాక్టర్

    |

    1983లో టీమిండియా తొలి వన్డే వరల్డ్ విజయంపై రూపొందుతున్న చిత్రం '83'. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ మెయిన్ హీరోగా కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అప్పటి జట్టులోని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సందీప్ పాటిల్ పాత్రలో చిరాగ్ పాటిల్ నటిస్తున్నాడు. చిరాగ్... సందీప్ పాటిల్ కొడుకే కావడం విశేషం.

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరాగ్ పాటిల్ మాట్లాడుతూ తన చిన్నతనంలోని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీమిండియా క్రికెటర్ కుమారుడిగా తాను చిన్న తనం నుంచి ప్రిన్స్‌లా పెరిగానని, ఆయన కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని తెలిపారు. చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడిని, ఇంట్లో, స్కూల్లో అందరినీ పరుగెత్తించేవాడిని, చదువు అంటే నచ్చేది కాదు.. నేను ఇంకా నా గ్రాజ్యువేషన్ పూర్తి చేయాల్సి ఉంది అన్నారు.

    చిన్నతనంలో దొంగతనంగా పార్టీలు చూసేవారం

    చిన్నతనంలో దొంగతనంగా పార్టీలు చూసేవారం

    మా చిన్నతనంలో మా ఇంటికి సినిమా వాళ్లు, క్రికెటర్లు వచ్చేవారు. చాలా పార్టీలు జరిగేవి. అయితే మేము చిన్న పిల్లలం కావడంతో మమ్మల్ని నాన్న ఆ పార్టీలోకి అనుమతించేవారు కాదు. వెళ్లి పడుకోమని చెప్పేవారు. అయితే నేను, నా బ్రదర్ టెర్రస్ పై నుంచి ఆ పార్టీలను చూసేవారం, ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయని చిరాగ్ పాటిల్ తెలిపారు.

    నువ్వు ఎప్పటికీ ఇండియాకు ఆడలేవు అన్నారు

    నువ్వు ఎప్పటికీ ఇండియాకు ఆడలేవు అన్నారు

    నాకు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఆసక్తి ఉండేది కాదు. నాన్న, తాతయ్య క్రికెటర్స్ కావడంతో నాపై ఒత్తిడి ఉండేది. అందుకే క్రికెట్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైమ్ నాన్న నేను క్రికెట్ ఆడటం చూసినపుడు ఒకటే అన్నారు. ‘నువ్వు ఎప్పటికీ ఇండియాకు ఆడలేవు, టైమ్ వేస్ట్ చేయొద్దు... ఇంకేదైనా చేయ్' అని సూచించారని చిరాగ్ పాటిల్ గుర్తు చేసుకున్నారు. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో ఇటు వైపు వచ్చినట్లు వెల్లడించారు.

    చిరాగ్ పాటిల్

    చిరాగ్ పాటిల్

    నటనపై ఆసక్తి ఉండటంతో చిరాగ్ పాటల్ యాక్టింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్నారు. ‘ఏక్ నెంబర్' అనే మరాఠీ టీవీ సిరీస్ ద్వారా తెరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత పలు మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘83' మూవీలో తన తండ్రి సందీప్ పాటిల్ పాత్రలో నటిస్తున్నాడు.

    83

    83

    83 మూవీ ఏప్రిల్ 10, 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రణవీర్ సింగ్(కపిల్ దేవ్), దీపిక పదుకోన్ (కపిల్ దేవ్ వైఫ్ రోమి భాటియా), తాహిర్ రాజ్(సునీల్ గవాస్కర్), శాఖిబ్ సలీమ్(మహిందర్ అమర్నాథ్), అమ్మీ విర్క్(బల్విందర్ సంధు), హార్డీ సంధు (మదన్ లాల్), జీవా (కృష్ణమాచారి శ్రీకాంత్), సాహిల్ ఖట్టర్(సయిద్ కిర్మాని), చిరాగ్ పాటిల్(సందీప్ పాటిల్), ఆదినాథ్ కొఠారె(దిలీప్ వెంగ్ సర్కార్) తదితరులు ఆయా క్రికెటర్ల పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    "I have never been interested in cricket. But, because my father and grandfather were cricketers, there was pressure. So, I also decided to join cricket. But the first time my father saw me playing he told me, "You will never play for India, so please don't waste time. Do something else." '83 actor Chirag Patil said in IB Times interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X