Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
14 ఏళ్ల వయసులో నాపై అత్యాచారం.. దారుణాన్ని బయటపెట్టిన అమీర్ ఖాన్ కూతురు
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొద్దికాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తన మానసిక సమస్యలపై ఇరా తాజాగా వీడియోను రిలీజ్ చేసి తన కష్టాలను చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా తన బాల్యంలో దారుణమైన అనుభవం ఎదురైంది అంటూ చెప్పారు. ఇంతకు ఇరా ఖాన్‌కు ఎదురైన చేదు అనుభవం ఎమిటంటే..

14 ఏళ్ల వయసులో నాపై అత్యాచారం
అప్పుడు నేను 14 ఏళ్ల వయసులో ఉన్నాను. నాపై అత్యాచారప్రయత్నం జరిగింది. నాపై లైంగిక దాడికి పాల్పడింది నాకు తెలిసిన వారే. నాతో వారు చేస్తున్న పని ఏమిటో అర్ధం కాలేదు. కాకపోతే ఏదో జరగకూడదనిది జరిగిందని అనిపించింది. కనీసం వారు చేస్తున్న పని వారికి తెలుసా అనే విషయాన్ని ఆలోచించాను అని ఇరా ఖాన్ తెలిపారు.

మరిచిపోవడానికి ఏడాది పట్టింది
నాకు ఎదురైన సంఘటన రోజు జరిగేది కాదు. కానీ భయంకరమైన సంఘటనను మరిచిపోవడానికి కనీసం ఏడాది కాలం పట్టింది. ఆ సమయంలోనే నా తల్లిదండ్రుల నుంచి సహాయం పొందాలని అనుకొన్నాను. అప్పుడే నా తల్లిదండ్రలు వద్దకు వెళ్లాలని అనుకొన్నాను. వెంటనే నా తల్లిదండ్రులకు ఈమెయిల్ రాశాను అని ఇరా ఖాన్ వీడియోలో తెలిపింది.

మానసికంగా కుంగిపోయాను..
నా బాల్యంలో జరిగిన సంఘటనతో మానసికంగా కుంగిపోయాను. అలాంటి అనుభవం నుంచి బయట పడటానికి నా తల్లిదండ్రులు అమీర్ ఖాన్, రీనా దత్తా వద్దకు వెళ్లాను. వారు తీసుకొన్న చర్యలతో ఆ భయంకర సంఘటనను మరిచిపోవడం జరిగింది. తల్లిదండ్రుల సంరక్షణ ఎంత అవసరమో అప్పుడు అర్ధమైంది అని ఇరా ఖాన్ తెలిపింది.

తల్లిదండ్రుల చొరవతో
నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన తర్వాత వారు చూపిన చొరవతో ఆ భయంకర సంఘటన నుంచి బయటపడ్డాను. నాకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలోచిస్తే నాకు తప్పు జరిగిందని, తప్పు చేశానని అనుకోలేదు. నా జీవితంలో జరుగాల్సిన ఓ ఘటన జరిగిపోయిందనే భావనతో ఇప్పటికీ ఉన్నాను అని ఇరా ఖాన్ వీడియోలో వెల్లడించారు.
Recommended Video

మానసిక క్షోభ నుంచి
ఆ తర్వాత జీవితంలో ఎదురైన సంఘటనలో మానసిక క్షోభను అనుభవించాను. దాని కోసం నేను చికిత్స తీసుకొని మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకొన్నాను. జీవితంలో మానసిక సంఘర్షణలు కామన్. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. అంతేగానీ వాటితో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు అని ఇరా ఖాన్ చెప్పే ప్రయత్నం చేశారు.