twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Laal Singh Chaddha డిజాస్టర్ పై ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం.. నష్టాలు భరించేందుకు సిద్ధం?

    |

    బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సినిమాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకునేవారు. దాదాపు ఆయన సినిమాపై పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా మొదటి వీకెండ్ లోనే వెనక్కి వచ్చేసేది. ప్లాప్ అయినా కూడా ఈజీగా అమీర్ ఖాన్ సినిమాలు 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకునేవి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. ఆయనపై ఉన్న నెగిటివ్ టాక్ తో పాటు సినిమా కంటెంట్ కూడా క్లిక్ కాకపోవడంతో లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఊహించని స్థాయిలో నష్టాలు వచ్చాయి.

    ఈ సినిమాను ఆమిర్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థతో పాటు వయాకామ్18 స్టూడియోస్ కూడా సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు ఈ సినిమా కోసం 170 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఆమీర్ ఖాన్ ఈ సినిమాతో సక్సెస్ అయితే లాభాల్లో వాటా అందుకోవాలని కూడా అనుకున్నాడు. అంతేకాకుండా ఆయన పారితోషికం కూడా తీసుకోలేదు. అయితే విడుదలకు ముందు సినిమాకు మంచి ఓటీటీ ఆఫర్ కూడా వచ్చింది.

    Aamir khan decided to help lal singh chaddha distributors

    అది దాదాపు సినిమా బడ్జెట్ కంటే ఎక్కువే కానీ అప్పుడు ఆమీర్ ఖాన్ ఎంత మాత్రం ఒప్పుకోకుండా. థియేటర్లోనే విడుదల చేయాలి అని పట్టుబట్టారు. దీంతో సినిమా విడుదలైన తర్వాత ఇప్పుడు కనీసం ఓటిటి హక్కులను సొంతం చేసుకోవడానికి ఏ ప్రముఖ సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అంతేకాకుండా చాలా తక్కువ రేటుకు అమ్ముడు పోయే అవకాశం ఉంది. ఇక ఏదేమైనా థియేట్రికల్ గా ఈ సినిమా నష్టాల బారిన పడడంతో ఇప్పుడు ఆమీర్ ఖాన్ ఆ నష్టాలను పూరించేందుకు రెడీ కావాల్సి వస్తుంది.

    దాదాపు 100 కోట్ల వరకు ఈ సినిమా నష్టపోయే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో ఆమీర్ ఖాన్ ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి వదులుకోవడమే కాకుండా ఇప్పుడు మళ్లీ మరికొంత డబ్బును నష్టాల బారిన పడిన వారికి ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇటీవల ఎక్కువ స్థాయిలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు బయర్లకు నిర్మాత నుంచి కాల్స్ వెళ్ళినట్లుగా ముంబై మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమీర్ ఖాన్ వారికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఆమీర్ ఖాన్ వచ్చిన నష్టాల్లో ఎంతవరకు భర్తీ చేస్తారో చూడాలి.

    English summary
    Aamir khan decided to help lal singh chaddha distributors..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X