For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Shah Rukh Khan: కష్టంతో పైకొచ్చిన స్టార్ హీరో.. రూ.10 నుంచి వేల కోట్ల ఆస్తి!

  |

  స్వయంకృషితో పైకి వచ్చిన అతి కొద్దిమంది బాలీవుడ్ హీరోలలో షారుక్ ఖాన్ ఒకరు. అతను పది రూపాయలతో ముంబై నగరంలో ఎన్నో రోజులు తిరిగాడు ఇక ఇప్పుడు అతని ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నేడు షారుక్ ఖాన్ 57వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అతనికి సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక షారుక్ ఖాన్ కు సంబంధించిన మొత్తం ఆస్తి ఎంత ఉంటుంది అనే వివరాల్లోకి వెళితే..

  ఇప్పటివరకు ఎన్ని సినిమాలంటే..

  ఇప్పటివరకు ఎన్ని సినిమాలంటే..

  బాలీవుడ్ చిత్ర పరిశ్రమ చరిత్రలో 80, 90ల కాలంలో అవకాశాలు అందుకోవడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ఎంతో ఓపిక నిరీక్షణ ఉంటే గాని అక్కడ ఒక స్టార్ ఇమేజ్ అయితే రాదు. ఇక వచ్చిన అవకాశాన్ని పట్టుకుని ఆ తర్వాత జాగ్రత్తగా వెళితే అక్కడ కోట్లల్లో సంపాదించుకోవచ్చు అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ అదేమీ అంత సాధారణమైన విషయం కాదు. ఇక షారుక్ ఖాన్ 15 ఏళ్ల వయసు నుంచే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలి అని కెరీర్ ను మొదలు పెట్టి.. ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించాడు.

  రొమాంటిక్ సినిమాలతో..

  రొమాంటిక్ సినిమాలతో..

  షారుక్ ఖాన్ మొదటగా టెలివిజన్ చానల్స్ లో కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక తర్వాత మెల్లగా అతను బాలీవుడ్ సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని చాలా మంచి అవకాశాలు అందుకున్నాడు. అతను మొదట కొన్ని విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించాడు. ఇక దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995), దిల్ తో పాగల్ హై (1997), కుచ్ కుచ్ హోతా హై (1998) వంటి వరుస రొమాంటిక్ చిత్రాలలో నటించిన తర్వాత అతను ప్రాముఖ్యతను పొందాడు.

   అన్ని రకాల సినిమాలు

  అన్ని రకాల సినిమాలు

  షారుక్ ఖాన్ అంటే కేవలం రొమాంటిక్ సినిమాలు మాత్రమే కాదు అని కొన్ని మాస్ యాక్షన్ సినిమాలు కూడా చేశాడు. స్వదేశీ సినిమాలో నాసా సైంటిస్ట్ గా అలాగే చెక్ దే ఇండియా సినిమాలో ఒక కోచ్ గా, మై నేమ్ ఇస్ ఖాన్ సినిమాలో మానసిక స్థితి బాగాలేని వ్యక్తిగా నటించాడు. అలాగే చెన్నై ఎక్స్ ప్రెస్ తో కూడా పూర్తిస్థాయిలో అన్ని వర్గాల కమర్షియల్ ఆడియెన్స్ ను కూడా కట్టుకున్నాడు. డాన్, రైస్ అనే హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు కూడా చేశాడు.

  భారీగా వ్యాపారాలు

  భారీగా వ్యాపారాలు

  బాలీవుడ్ బాద్షా, బాలీవుడ్ కింగ్ ఖాన్ గా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న షారుక్ ఖాన్ పలు వ్యాపారాలలో కూడా మంచి ఆదాయాన్ని అందుకున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో అతను ఒక భాగస్వామిగా కొనసాగుతున్నాడు. అలాగే ఐపిఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు కూడా అతను ఒక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక వివిధ రకాల బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటూ వచ్చాడు.

   10 రూపాయలతో మొదలు పెట్టి

  10 రూపాయలతో మొదలు పెట్టి

  చిన్న తనంలో పది రూపాయలతో ముంబై నగరాల్లో ఎక్కువ రోజులు తిరిగినట్లుగా చాలా ఇంటర్వ్యూలలో షారుక్ ఖాన్ తెలియజేశాడు. ఇక ఇప్పుడు అతను ఒక్కో సినిమాకు వందల కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. కేవలం పారితోషికం మాత్రమే కాకుండా సినిమా సక్సెస్ అయితే అందులో షేర్ కూడా అందుకుంటున్నాడు. ఇక బ్రాండ్ ప్రమోషన్స్ కోసం కూడా అతను 30 నుంచి 40 కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

  మొత్తం ఆస్తి ఎంతంటే..

  మొత్తం ఆస్తి ఎంతంటే..

  ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ కు సంబంధించిన ఆస్తుల లెక్కలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. గతంలో ఒక బాలీవుడ్ మీడియా చేసిన సర్వేలో బాలీవుడ్లో అత్యంత సంపన్నుల హీరోలలో షారుక్ ఖాన్ టాప్ లిస్ట్ లో ఉంటాడని తేలింది. ఇక దాదాపు అతని ఆస్తుల విలువ 5వేల కోట్లకు పైగానే ఉంటుంది అని అంచనా వేశారు. అంటే 10 రూపాయలతో ముంబైలో తిరిగిన షారుక్ ఖాన్ ఇప్పుడు వేల కోట్ల ఆస్తులకు సంపన్నుడు కావడం నిజంగా గ్రేట్. ఇక అతను నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి.

  English summary
  Actor Shah Rukh Khan birthday special article his total assets value
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X