Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sushant Singh Rajput కేసు విచారణను మళ్లీ సిబీఐ చేపట్టాలి.. ప్రముఖ నటుడు డిమాండ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్య కాదు. ముమ్మాటికి అది హత్యే అంటూ కూపర్ హాస్పిటల్ పోస్టుమార్టం ఉద్యోగి రూప్ కుమార్ షా సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ కేసును మళ్లీ పున:విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ..
కూపర్ హాస్పిటల్ రిటైర్డ్ ఉద్యోగి రూప్ కుమార్ షా వ్యాఖ్యల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరోసారి వివాదంగా మారింది. కాబట్టి ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యతను బట్టి సీబీఐ పున: విచారణ చేపట్టాలి. రూప్ కుమార్ షాను విచారించి సుశాంత్ మరణం వెనుక ఉన్న వ్యక్తులను బయటకు తీసుకురావాలి. ఈ కేసు దర్యాప్తును త్వరగా ముగించి సుశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలి అని శేఖర్ సుమన్ అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అగ్రహీరోలు స్పందించకపోవడం కూడా నెపొటిజమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ఏం జరిగిందనేది వారికి తెలుసు. అందుకే వారు సోషల్ మీడియాలో కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయడం లేదు. కొన్ని టీవీ ఛానెల్స్ కూడా సుశాంత్ మరణానికి సంబంధించిన విషయాలను ప్రసారం చేయడం లేదు అని అన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి కూపర్ హాస్పిటల్ రిటైర్డ్ ఉద్యోగి రూప్ కుమార్ షా మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ బాడీని చితకబాదిన ఆనవాళ్లు ఉన్నాయి. పలు చోట్ల ఎముకలు విరిగిపోయాయి. బాడీలో విరిగిన ఎముకలు ఉంటే ఎలా ఆత్మహత్య చేసుకొంటాడు. కంటిపై బలంగా పిడిగుద్దులు గుద్దితే కళ్ల చుట్టు నల్లని మచ్చలు ఏర్పడ్డాయి అని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.