RajKundra కేసులోకి నన్ను లాగొద్దు.. లాగితే లీగల్ గా వెళ్తా..ఉమేష్ కామత్ వార్నింగ్!

రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా చాలా మందిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. నేరుగా కొంత మంది అరెస్ట్ అయితే, మరికొందరు తమ పేర్లు బయటకు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏమాత్రం సంబంధం లేని ఒక నటుడు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. అసంభవ్, ఎకా లగ్నాచి తీస్రీ గోష్ట అనే సినిమాల్లో నటించిన మరాఠీ నటుడు ఉమేష్ కామత్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. అశ్లీల కేసులో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకి తనకు సంబంధం కలపడం గురించి నటుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి, అశ్లీల కేసులో పోలీసుల అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పిఎ పేరు ఉమేష్ కామత్. కొన్ని మీడియా నివేదికలలో, రాజ్ కుంద్రా యొక్క పిఎ ఫోటోకు బదులుగా మరాఠీ నటుడు ఉమేష్ కామత్ పేరు మరియు ఫోటో ఉపయోగించబడింది. ఈ విషయంలో నటుడు చాలా కోపంగా ఉన్నాడని అంటున్నారు. ఇక ఈ విషయంలో తాను చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. తాజాగా ఉమేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను పంచుకున్నారు. అందులో ఉమేష్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉమేష్ కామత్ తన పోస్ట్‌లో ఇలా రాశారు, 'నేను వృత్తిరీత్యా నటుడు ఉమేష్ కామత్.

Actor Umesh Kamat takes legal route for linking him to Raj Kundra case

వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి న్యూస్ ఛానల్స్ / మీడియా ప్లాట్‌ఫాంలు నా పేరును అనవసరంగా లాగారు అని పేర్కొన్నారు. రాజ్ కుంద్రా కేసులో చిక్కుకున్న అతని భాగస్వామి పేరు ఉమేష్ కామత్ అని, నాకు అతనికి ఓకే పేరు ఉండటంతో రాజ్ కుంద్రా కేసులో వార్తలు వ్రాసేటప్పుడు మరియు చూపించేటప్పుడు చాలా మీడియా సంస్థలు నా చిత్రాన్ని ఉపయోగించాయని అన్నారు. ఈ కారణంగా నా ఇమేజ్ దెబ్బతిందన్న ఆయన రాజ్ కుంద్రా కేసులో నా పేరును బలవంతంగా లాగారని అన్నారు. ఇది నాకు మరియు నా కుటుంబానికి బాధ కలిగించిందని అన్నారు. రాజ్ కుంద్రా కేసులో నిందితులుగా నా ఫోటోలు, కనుక వాడితే తగిన చట్టపరమైన చర్యలు కొనసాగించాలని నిర్ణయించుకున్నాను అన్ని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X