Don't Miss!
- News
నన్ను ముసలోడివి అంటావా: కొండారెడ్డి బురుజు దగ్గర తేల్చుకుందామా? పవన్‌ను ఏకి పారేసిన బైరెడ్డి
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Aishwarya Rai Bachchan: మరోసారి చిక్కుల్లో పడిన ఐశ్వర్యారాయ్.. రెవెన్యూ అధికారుల నుంచి నోటీసులు
బాలీవుడ్ బ్యూటీ నటి ఐశ్వర్యారాయ్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. కాంట్రవర్సీ లకు చాలా దూరంగా ఉండే ఐశ్వర్యారాయ్ ఈసారి మాత్రం ఒక ల్యాండ్ విషయంలో ఊహించని విధంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఐశ్వర్యారాయ్ కు సంబంధించిన ఆరోపణలపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిజీగా లేకపోయినప్పటికీ
బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యారాయ్ నాలుగు పదుల వయసు దాటినా కూడా తన అందంతో ఇంకా కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నటిగా గతంలో అంత బిజీగా లేకపోయినప్పటికీ ఆమెకు సంబంధించిన ఏదో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గత ఏడాది పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అందులో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

రెవెన్యూ అధికారుల నుంచి నోటీసులు
ఐశ్వర్య రాయ్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఐశ్వర్యారాయ్‌కి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. నాసిక్ లోని ఓ ల్యాండ్ కు ఆమె పన్ను చెల్లించ లేదని ఆ కారణంగానే నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివాదంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

పన్ను విషయంలో..
మరిన్ని వివరాలలోకి వెళితే.. నాసిక్ సిన్నార్‌లోని అవడీ ప్రాంతంలో నటి ఐశ్యర్యా రాయ్ కు ఖరీదైన ల్యాండ్ ఉంది. అయితే ఆ భూమికి సంబంధించిన పన్నులను ఐశ్వర్యారాయ్ చెల్లించడం లేదట. దాదాపు ఇప్పటివరకు రూ.21.960 చెల్లించాల్సి ఉందట. ఆమెకు మొత్తంగా అక్కడ హెక్టార్ భూమి ఉందని సమాచారం. ఇక పలుమార్లు ఆమె మేనేజర్స్ కు సమాచారం అందించినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అంటున్నారు.

తగిన చర్యలు తీసుకుంటామని
ఇక నోటీసులు అందిన తరువాత వీలైనంత త్వరగా స్పందించాలని.. అలాగే 10 రోజులలోపు బకాయిలు చెల్లించాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. లేకుంటే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం 1966లోని సెక్షన్ 174 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఐశ్వర్యారాయ్ కు అధికారులు నోటీసులో అందించారు.

త్వరలోనే మరో సినిమా
ఇక ఐశ్వర్యారాయ్ సినిమాల విషయానికి వస్తే ఆమె గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో తమిళ చారిత్రాత్మక చిత్రం పిఎస్1 లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అందులో ప్రముఖ తమిళ సినీ తారలు విక్రమ్ జయం రవి కార్తీ అలాగే త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక సెకండ్ పొన్నియిన్ సెల్వన్ ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు.