Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
KL Rahul బాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లి.. బెదిరిపోయేలా ఆంక్షలు.. గెస్టులు ఎవరైనా పాటించాల్సిందే!
బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ స్టార్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న సెలబ్రెటీ జంట పెళ్లి వార్తలకు మొత్తానికి ముగింపు కార్డు పెట్టడానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
అయితే పెళ్లికి చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రముఖ క్రికెటర్లు రాబోతున్నారు. ఇక ఈ పెళ్లిలో ఒక కఠినమైన కండిషన్ కూడా పెట్టినట్లు సమాచారం. దాన్ని సెలబ్రిటీలకు కూడా ఫాలో కావాల్సిందేనట. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రేమ విషయంలో అలా..
బాలీవుడ్ ప్రముఖ హీరో సునీల్ శెట్టి గారాల కూతురు అతియా శెట్టి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ గత కొంతకాలంగా టీం ఇండియా క్రికెటర్ రాహుల్ తో ప్రేమలో కొనసాగుతోంది. చాలాసార్లు వీరు బయట మీడియా కంటపడ్డారు. అయితే ఎప్పుడు కనిపించినా కూడా వారి ప్రేమ విషయంపై మాత్రం పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. అబద్దమో అన్నట్లుగానే కేవలం ఫ్రెండ్స్ అనే తరహాలోనే ప్రవర్తించారు.

అలాంటి వార్తలు ఎన్నిసార్లు వచ్చినా..
అంతేకాకుండా కేఎల్ రాహుల్ మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్న కారణంగా అతియా శెట్టి అతనికి దూరంగా ఉంది అని వీరి మధ్యలో బ్రేకప్ కూడా జరిగింది అని బాలీవుడ్ మీడియాలో చాలాసార్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అలాంటి వార్తలు ఎన్నిసార్లు వచ్చినా కూడా రాహుల్ అలాగే అతియా శెట్టి కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఎప్పటిలానే వారి పనుల్లో బిజీ అవుతూ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం కలుసుకుంటూ వచ్చారు.

స్టార్ ఇంట్లోనే పెళ్లి
ఇక మొత్తానికి వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. గత నెలలోనే ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి ముహూర్తాలను ఫిక్స్ చేసుకున్నారు. మహారాష్ట్ర కాండాల్లోని సునీల్ శెట్టి స్వగృహంలోనే వీరి వివాహం జరగబోతోంది. మొదట ముంబైలోని ఒక ప్రముఖ హోటల్లో వీరి వివాహం చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ సునీల్ శెట్టి తన ఇంట్లోనే కూతురు పెళ్లి చేయాలనీ ఫిక్స్ కావడంతో రాహుల్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.

రాబోయే గెస్టులు
ఇక వీరు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వేడుకకు సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎందుకంటే ఈ వేడుకకు ప్రముఖ సినీ తారలు సల్మాన్ ఖాన్ అలాగే అక్షయ్ కుమార్, జాకి ష్రాఫ్, షారుఖ్ ఖాన్ ఇలా కొంతమంది స్టార్ హీరోలు హాజరయ్యే అవకాశం ఉందట. అలాగే ప్రముఖ క్రికెట్ ధోని కూడా వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

అందరికి ఒక షరతు
అయితే ఈ పెళ్లి వేడుకకు వచ్చే అందరికీ కూడా ముందుగానే ఒక షరతు విధించారట. జనవరి 22న మెహేంది వేడుకతో వీరి ప్రీ వెడ్డింగ్ పనులు మొదలవుతాయి. అయితే అప్పటినుంచి పెళ్లి ముగిసే వరకు ఎవరు కూడా ఫోటోలు తీయకుండా ప్రైవసీ మెయింటైన్ చేయాలి అని ముందుగానే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ను ఏర్పరచుకున్నారట. ఇక వారి నుంచి కూడా ఫోటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా..
అయితే గతంలో కూడా కత్రినా కైఫ్ పెళ్లి వేడుకల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అలాగే బాలీవుడ్ స్టార్స్ ఎవరు వచ్చినా కూడా వారి ఫోన్స్ ఏమాత్రం పెళ్లి వేడుకలు బయటకు తీయలేదు. ఇక ఇప్పుడు రాహుల్ అతియా శెట్టి పెళ్లి వేడుకలో కూడా అలాంటి రూల్ ఫాలో అవుతున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.